Rajamouli-Rajinikanth : ఆ కోలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి- రజినీకాంత్ కాంబినేషన్ ను దెబ్బకొట్టాడా?
Rajamouli-Rajinikanth : బాహుబలి నుంచి తన ప్రతి ప్రాజెక్టను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే చిత్రం ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు-రాజమౌళి సినిమా అధికారికంగా ప్రకటించినా ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఓ సారి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్టయ్యిందని, మరోసారి రేపోమాపో షూటింగ్ మొదలవుతుందని రూమర్లు వస్తున్నా వీటిని ఖండించడం లేదు. అలాగని సమర్థించడం లేదు. అందరినీ కన్ఫూజ్ చేస్తున్నాడు రాజమౌళి.
రాబోయే సినిమా గురించి పక్కన పెడితే రాజమౌళి గతంలో ఓ స్టార్ హీరోతో సినిమా ప్రయత్నాలు చేయగా అది కార్యరూపం దాల్చలేదు. ఆ హీరో కథ ఓకే చేశాక, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ చేశాక ఈ సినిమాను పక్కన పెట్టాడట సదరు హీరో. అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్.
రజినీకాంత్ శివాజీ సినిమా హిట్టయ్యాక రాజమౌళి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే రాజమౌళికి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్నా ఇప్పుడున్నంత క్రేజ్ లేదు. అప్పట్లోనే రాజమౌళి రజినీకాంత్ కు కథ చెప్పి ఒప్పించారు. దీంతో రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. కానీ అంతలోనే తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ రోబో కథను రజినీకాంత్ కు వినిపించాడట.శంకర్ శివాజీతో తనకో సూప ర్ హిట్టివ్వడం, రోబో లాంటి వినూత్న కథ చెప్పడంతో రాజమౌళి సినిమాను ఆపేశాడట. అలా వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోయింది. శంకర్ రజినీకాంత్ కు రోబో కథ చెప్పకుంటే రాజమౌళి సినిమా తెరకెక్కించి అప్పుడే పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేవాడని ఫిలిం సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది.