JAISW News Telugu

NTR : షూటింగ్ స్పాట్ లో ఫారిన్ సిగరెట్స్ కోసం సీనియర్ ఎన్టీఆర్ ఇంత రచ్చ చేశాడా..?

senior NTR for foreign cigarettes

senior NTR for foreign cigarettes

NTR : సాధారణంగా సీనియర్ ఎన్టీఆర్ కి  సిగరెట్స్ కాల్చే అలవాటు లేదు.కేవలం సినిమాల్లో కొన్ని పాత్రల  కోసం మాత్రమే ఆయన కాలుస్తారు. సిగరెట్స్ కాల్చే అలవాటు లేదు కానీ, చుట్టాలు కాల్చే అలవాటు మాత్రం ఎన్టీఆర్ కి ఉంది. కానీ అప్పట్లో ఆయన గుడిగంటలు సినిమా కోసం సిగరెట్స్ ని కాల్చాల్సి వచ్చింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు జగ్గయ్య, మిక్కిలినేని, నాగయ్య, కృష్ణకుమారి వంటి దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రల్లో  కనిపించారు .డుండి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి వి.మధుసూదన్ రావు దర్శకుడిగా పని చేసాడు .తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఆలయమణి అనే చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళం లో శివాజీ గణేశన్ పోషించిన నెగటివ్ షేడ్ క్యారక్టర్ ని ఎన్టీఆర్ ఇందులో చేసాడు.

అయితే ఈ షూటింగ్ జరుగుతుందని రోజులు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ అనే ఒక ఫారిన్ బ్రాండ్ సిగరెట్స్ తాగడం ఎన్టీఆర్ అలవాటు చేసుకున్నాడు. ప్రతీ రోజు ఆయన రెండు డబ్బాల సిగరెట్ ప్యాకెట్స్ ని ఖాళీ చేసేవాడట.పొద్దున్నే షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు ఒక బాక్స్ అలాగే లంచ్ తర్వాత మరొక బాక్స్ ప్రొడక్షన్ వారు ఎన్టీఆర్ కి ఇచ్చేవాళ్ళు.ఒక్కో బాక్స్ లో 20 సిగరెట్స్ ఉంటాయి. ఫారిన్ బ్రాండ్ సిగరెట్ కావడం తో ఇది మామూలు లోకల్ పాన్ షాప్స్ లో దొరకదు.

అయితే ఒకరోజు ఎన్టీఆర్ సిగరెట్ తాగే ముందే నిర్మాత సీల్ ని ఓపెన్ చేసి ఒక సిగరెట్ తాగాడట. అలా సీల్ ఓపెన్ చేసి ఉన్న సిగరెట్ ప్యాకెట్ ని ఎన్టీఆర్ కి ఇవ్వగానే ఎన్టీఆర్ ఆవేశం తో ఊగిపొయ్యాడట. ఎంత ధైర్యం నీకు సీల్ తీసిన ప్యాకెట్ ని నాకు ఇస్తావా అని అసిస్టెంట్ పై ఫైర్ అయ్యాడట. నిర్మాత తీసుకున్నాడు సార్ అని చెప్పినా కూడా వినలేదట, సీల్ వేసి ఉన్న కొత్త ప్యాకెట్ తెస్తేనే షూటింగ్ చేస్తాను అని భీష్మించి కూర్చున్నాడట. దీంతో వేరే అసిస్టెంట్ రంగం లోకి దిగి, ఊరంతా వెతికి ఆ సిగెరెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడట.

Exit mobile version