Sania Mirza : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో సానియా మీర్జా పేరు ఏ రేంజ్ లో వినిపిస్తుందో మన అందరికీ తెలిసిందే. తన భర్త షోయబ్ మాలిక్ తో ఆమె విడిపోయిందని సానియా మీర్జా తండ్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. ఆయన ఈ మాట మాట్లాడిన కొద్దిరోజులకే షోయబ్ మాలిక్ పాకిస్తానీ హీరోయిన్ సనా జావేద్ ని పెళ్లాడుతూ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు అప్లోడ్ చేసాడు.
దాంతో వీళ్లిద్దరు విడిపోయారు అనే విషయం అందరికీ స్పష్టమైంది. 2010 వ సంవత్సరం లో వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి కూడా అప్పట్లో పెద్ద వివాదమే, పాకిస్తాన్ ప్లేయర్ తో ఒక భారతీయ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి?, దీనికి మేము అసలు ఒప్పుకోము అంటూ అప్పట్లో సానియా మీర్జా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేసారు. కానీ అవేమి పట్టించుకోకుండా సానియా మీర్జా షోయబ్ మాలిక్ ని పెళ్ళాడి పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.
కానీ ఆమె టెన్నిస్ ఇండియా తరుపున ఆడడం మాత్రం మానలేదు. గత ఏడాది వరకు ఆమె టెన్నిస్ కొనసాగిసునే ఉంది. తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడి టెన్నిస్ క్రీడకి రిటైర్మెంట్ ప్రకటించింది. గత ఏడాది ప్రారంభం నుండే ఆమె తన కొడుకు తో కలిసి ఇండియా లోనే ఉంటుంది. ఏమైంది ఈమెకి, ఒంటరిగా ఇండియా లోనే ఉంటుంది?, భర్త షోయబ్ మాలిక్ తో ఏమైనా గొడవలు అయ్యాయా ?, ఇద్దరు విడిపోయారా అంటూ మీడియా లో కథనాలు వచ్చాయి. కొంతమంది అది నిజం అని నమ్మితే, కొంతమంది రూమర్స్ అనుకున్నారు. కానీ చివరికి అవి రూమర్స్ కాదు , నిజమే అని ఖరారు అయ్యింది. అయితే సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య వివాదాలు వచ్చి విడిపోవడానికి కారణం, సానియా మీర్జా ఒక టాలీవుడ్ హీరో తో పెట్టుకున్న ఎఫైర్ కారణం అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
సానియా మీర్జా కి టాలీవుడ్ , బాలీవుడ్ సెలబ్రిటీస్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. సానియా ఎవరితో క్లోజ్ గా మాట్లాడినా షోయబ్ మాలిక్ తట్టుకోలేకపొయ్యేవాడట. ఆ కారణం చేతనే వీళ్ళ మధ్య వివాదాలు ఏర్పడ్డాయని, లేని పోనీ అపోహలు మనసులో పెట్టుకొని సానియా మీర్జా కి దూరం జరిగి, సనా జావేద్ తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని, అందుకే వీళ్ళు చివరికి విడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి.