Samantha : ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్లకు తేలికగా ఆ స్థానాలు దక్కలేదు. అంతకు ముందు వాళ్ళు పడిన కష్టాలు, ఎదురుకున్న అవమానాలు అన్నీ ఇన్నీ కావు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ప్రతీ సెలబ్రిటీ జీవితం మనకి ఒక పాఠమే. అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి నేడు సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు సమంత.
ఈమెకి సౌత్ లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత మార్కెట్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమధ్య కాలం లో రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి దూరం అయ్యింది, ఎక్కువగా నటనకి ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే సమంత చేస్తూ వస్తుంది. గత ఏడాది ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ‘ఖుషి’ అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఆమె తనకి సోకిన ‘మయోసిటిస్’ అనే వ్యాధికి చికిత్స తీసుకున్న కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించింది. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘చిన్నతనం లో నన్ను అమ్మానాన్న బాగా చదువుకోమని ఆశీర్వదించేవారు. నేను కూడా బాగా చదువుకునే దానిని. కానీ ఇంట్లో ఉన్న ఆర్ధిక పరిస్థితుల కారణంగా నేను సంపాదించాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయం లో నేను చేతికి వచ్చిన ప్రతీ జాబ్ ని చేశాను. అలా నేను ఒక స్టార్ హోటల్ లో జరిగే ఈవెంట్ కోసం పని చేశాను. ఆ ఈవెంట్ లో పని చేసినందుకు నాకు 500 రూపాయిలు ఇచ్చారు, అదే నా మొట్టమొదటి సంపాదన’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.
ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అలా 500 రూపాయలతో ప్రారంభమైన సమంత కెరీర్ ఇప్పుడు ఒక్కో సినిమాకి పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి వచ్చింది. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రతీ ఒక్కరు జీవితం లో సక్సెస్ అవ్వాలని అనుకుంటే ఇలాంటి ఐకాన్స్ ని రోల్ మోడల్ గా తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా కష్టపడాలి.