Rohit Sharma : టీం ఇండియా, అష్గానిస్తాన్ ల మధ్య 2024 జరిగిన టీ 20 మ్యాచ్ టైగా ముగియగా.. రెండో సూపర్ ఓవర్ లో టీం ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కాస్త చివరకు వివాదంగా మారింది. ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 212 పరుగుల టార్గెట్ ను విధించింది. అయితే దీన్ని ఛేదించే క్రమంలో అఫ్గాన్ బ్యాటర్లు పోరాడి స్కోరును సమం చేశారు.
సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 17 పరుగుల చేసింది. సూపర్ ఓవర్ లో ఇండియా కూడా సేమ్ పరుగులు చేసింది. అయితే చివరి బంతికి రెండు పరుగులు చేస్తే ఇండియా గెలిచేది. కానీ యశస్వి జైశ్వాల్ మాత్రం బాల్ మిస్ చేసి కేవలం ఒక్క పరుగు తీశాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండాల్సిన రోహిత్ శర్మ మాత్రం రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.
ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక బాల్ కు రెండు రన్స్ చేయాల్సిన సమయంలో వేగంగా పరుగెత్తలేననుకున్న రోహిత్ రింకూ సింగ్ ను బ్యాటింగ్ కు దించాడు. దీనిపై అఫ్గాన్ ప్లేయర్లు అభ్యంతరం తెలిపిన రిటైర్డ్ కావొచ్చని అందరూ భావించారు. ఓకే ఇంతటితో ఆగిపోయిందా అంటే సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్ కు దారి తీసింది. దీంతో రెండో ఓవర్ సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు మళ్లీ రోహిత్ శర్మ వచ్చాడు. ఇది అన్ ఆఫిషీయల్ గా బ్యాటింగ్ చేయడానికి రోహిత్ శర్మ వచ్చాడని అందరూ అనుకున్నారు.
అయితే రోహిత్ అలా బ్యాటింగ్ కు దిగడం రూల్స్ కు విరుద్ధమని మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం.. గాయపడ్డ ఆటగాడు కానీ, రిటైర్డ్ అయినా ప్లేయర్ వెంటనే బ్యాటింగ్ కు దిగడం కుదరదని కానీ రోహిత్ శర్మ అఫ్గాన్ మ్యాచ్ లో రూల్స్ అతిక్రమించి బ్యాటింగ్ కు దిగి చీట్ చేసి గెలిచాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.