Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం ‘మగధీర’. చిరుత లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కేవలం రెండవ సినిమాతోనే అంతటి బలమైన క్యారక్టర్ ని చేసి శబాష్ అనిపించుకోవడమే కాకుండా, ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం తిరగరాసాడు రామ్ చరణ్. అప్పుడప్పుడే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన బాధలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు.
ఈ సినిమా కేవలం రామ్ చరణ్ కెరీర్ ని మాత్రమే కాదు, కాజల్ అగర్వాల్ కెరీర్ ని కూడా మార్చేసింది. అప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ కెరీర్ ని నెట్టుకొచ్చిన కాజల్ అగర్వాల్ ఈ సినిమా తో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
ఈమె సౌత్ లో ప్రతీ సూపర్ స్టార్ తో కలిసి నటించింది కానీ, ఎక్కువ సార్లు రిపీట్ గా ఈమె జోడీ కట్టిన హీరో మాత్రం రామ్ చరణ్ అనే చెప్పాలి. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ మగధీర చిత్రం లోనే అద్భుతంగా అనిపించింది. రామ్ చరణ్ తో కాజల్ అగర్వాల్ కి మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఈ సినిమా తర్వాత వెంటనే అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘మెరుపు’ అనే సినిమా మొదలైంది. ‘బంగారం’ ఫేమ్ ధరణి దర్శకత్వం లో, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ తన ‘రచ్చ’ సినిమాలో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకునేందుకు చూసాడు. కానీ ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడం తో తమన్నా ని తీసుకున్నారు.రచ్చ తర్వాత వచ్చిన ‘నాయక్’ లో మళ్ళీ కాజల్ అగర్వాల్ ని తీసుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన ఎవడు, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. వాస్తవానికి ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రానికి ముందుగా కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నాడు ఆ చిత్ర డైరెక్టర్ కృష్ణ వంశీ. కానీ రామ్ చరణ్ పట్టుబట్టి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. అలా రామ్ చరణ్ అప్పట్లో తన ప్రతీ సినిమాకి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకోవాల్సిందిగా డైరెక్టర్స్ పై ఒత్తిడి పెంచేవాడట.