Raashii Khanna : పెళ్లి కాకుండానే రాశి ఖన్నా తల్లైందా? అసలు విషయమేంటంటే..

Raashii Khanna

Raashii Khanna

Raashii Khanna : అందం, అందానికి తగ్గ శారీరక సౌష్ఠవమే కాదు టాలెంట్ ఉన్నా రాశీ ఖన్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయింది. అందాలు ఆరబోసిన కూడా సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే చలామణిలో ఉంది. ఇప్పుడైతే  అవకాశాలు పెద్దగా లేనట్టే ఉంది. చేసిన కొన్ని సినిమాలే అయిన ఆడియన్స్ లో రాశి ఖన్నాను మాత్రం అందరు గుర్తుపడతారు కానీ ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర మాత్రం పడలేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైంది. ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించారు. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియవు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు.

అయితే బాలీవుడ్‌లో మాత్రం రాశి ఖన్నా మంచి క్రేజ్ సంపాదించకుంది. అక్కడ వరుస సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ చిన్న పాపని ఎత్తుకొని ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఏంటీ రాశి ఖన్నా పెళ్లి కాకుండానే తల్లైందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

అయితే రాశి ఖన్నా ఎత్తుకున్నది ఆమె మేనకోడలట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. ”నా అందమైన మేనకోడలు రాకతో మా కుటుంబం చాలా అందంగా మారింది. మా లిటిల్ ప్రిన్సెస్. మాటల్లో చెప్పలేనంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన కొంటె నెటిజన్లు సడెన్ గా చూసి పెళ్లికాకుండా రాశీఖన్నా తల్లైంది ఏంటి? అనుకున్నామని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మీ మేనకోడలు కూడా మీ అంతా అందగత్తె కావాలని కామెంట్ చేశారు.

TAGS