Prabhas-Gopichand : గోపీచంద్ ని హీరో చెయ్యడం కోసం ప్రభాస్ ఇన్ని త్యాగాలు చేశాడా..? స్నేహం అంటే ఇదే!

 Prabhas make sacrifices to make Gopichand a hero

Prabhas sacrifices for his friend Gopichand

Prabhas-Gopichand : రెబెల్ స్టార్ ప్రభాస్ ని ఇండస్ట్రీ లో అందరూ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ తో అందరూ స్నేహం చెయ్యాలని అనుకుంటారు, ప్రభాస్ కూడా అందరితో స్నేహం గానే ఉంటాడు కానీ, నా అనుకున్న వాళ్ళ కోసం మాత్రం ఎంత దూరం అయినా వెళ్తాడు. ఆయన దగ్గర ‘నా’ అనిపించుకునే అర్హత సాధించడం చాలా కష్టం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ప్రభాస్.

కానీ ఇండస్ట్రీ లో ఆయన మనసుకి ఎంతో ఇష్టమైన స్నేహితుల లిస్ట్ తీస్తే అందులో మొదటి స్థానం లో ఉంటాడు గోపీచంద్. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్  మరియు రానా వంటి వారు ఉన్నారు. వీళ్లంతా ప్రభాస్ కి ఇండస్ట్రీ లోకి రాకముందు నుండే పరిచయం. ముఖ్యంగా గోపీచంద్ మీద ప్రభాస్ కి ఉన్న ప్రేమ మామూలుది కాదు. అందుకు కొన్ని ఉదాహరణలు మీకు చెప్పబోతున్నాం.

టీ.కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ‘తొలివలపు’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు గోపీచంద్. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయనకీ తేజా, నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘జయం’ సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హీరో పాత్రని పూర్తిగా డామినేట్ చేసిన విలన్ పాత్ర అది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు. వర్షం సినిమా షూటింగ్ సమయం లో అప్పటి వరకు గోపీచంద్ తో తనకి ఉన్న స్నేహ బంధం పది రెట్లు పెరిగింది.

ఏ రేంజ్ లో అంటే ఒకే తల్లి కడుపునా పుట్టకపోయిన కూడా సొంత సోదరులు అని అనుకునేంత రేంజ్ లో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. ‘వర్షం’ తర్వాత గోపీచంద్ హీరో గా ఎదగాలని అనుకున్నాడు. అలా అనుకున్న సమయం లో ప్రభాస్ కొంతమంది డైరెక్టర్స్ ని గోపీచంద్ కోసం రిఫర్ చేసాడు. ఆ తర్వాత తన అన్నయ్య ప్రభోద్ యూవీ క్రియేషన్స్ ప్రారంభించినప్పుడు ఆ బ్యానర్ లో పలు సినిమాలు చేయించాడు ప్రభాస్.  అలా ప్రారంభమైన గోపీచంద్ కెరీర్ లో మంచి హిట్స్ ఉన్నాయి. కానీ ఈమధ్య కాలం లో మాత్రం ఆయనకీ వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి.

TAGS