JAISW News Telugu

Nagababu : అనకాపల్లి నుంచి నాగబాబును తప్పించారా? అన్నకు హ్యాండిచ్చిన తమ్ముడు?

Nagababu

Nagababu

Nagababu : త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్  వచ్చే అవకాశం ఉండడంతో నేతలంతా బిజీ అయిపోయారు. వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభలు పెడుతూ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఇటీవలే 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను కూటమి ప్రకటించింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు ఇచ్చారు. ఇక సీట్లు ప్రకటించిన సమయంలో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తాడనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే ఆయన అనకాపల్లిలో పర్యటించారు కూడా. అయితే రీసెంట్ గా ఓ వార్త పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నాగబాబును ఆ స్థానం నుంచి తప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాత ఆ పార్టీలో కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు. ఇక ఇటీవల విడుదల చేసిన జాబితాల్లో తెనాలి నుంచి నాదెండ్ల పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అయితే తాను పోటీ చేస్తున్న సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా అసెంబ్లీ స్థానాల పక్కన పెడితే..పార్లమెంట్ స్థానాల విషయంలో ఓ వార్త నడుస్తోంది. పొత్తులో భాగంగా 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. అందులో మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ అని తెలుస్తోంది. ఇందులో మచిలీపట్నం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. అలానే కాకినాడ నుంచి మరో కీలక నేత పోటీ చేయనున్నారు.

ఇక అనకాపల్లి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారనే చాలా రోజుల నుంచి ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఆయన అనకాపల్లి నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారని సమాచారం. ఆయన్ను అనకాపల్లి నుంచి తప్పించడం అందుకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చంద్రబాబు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ వంటి పలు స్థానాల్లో తన అభ్యర్థులను తప్పించాడని పలువురు అంటున్నారు. అలానే అనకాపల్లి విషయంలో కూడా చంద్రబాబు ఆదేశాలతోనే నాగబాబును తప్పించారని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.

మొత్తంగా చంద్రబాబు కనుసన్నల్లోనే సీట్లు తీసుకోవడం, అభ్యర్థులను ఎంపిక చేయడం.. వంటి పనులను పవన్ చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఇప్పటివరకు పార్టీనేతలకే హ్యాండ్ ఇచ్చిన పవన్ ఈ సారి ఏకంగా సొంత అన్నకే హ్యాండ్ ఇచ్చాడని ప్రచారం నడుస్తోంది.

Exit mobile version