JAISW News Telugu

Samantha : చైతూ సామ్ కి అంత భరణం ఇచ్చి వదిలించుకున్నాడా?

FacebookXLinkedinWhatsapp
Samantha

Samantha

Samantha : అక్కినేని వారసుడు నాగ  చైతన్య రెండో వివాహానికి సిద్ధమై ఇటీవల శోభితన ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు నాగ చైతన్య. పాతవి, కొత్తవి అన్నీ కలిసి వార్తలు వండేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎప్పుడో  జరిగిపోయిన వాటిని  ఇప్పడు స్ప్రెడ్ చేస్తున్నారు.  పది రోజులుగా ఏదో ఒక అంశపై శోభిత-సమంత-చైతూపై సోషల్ మీడియా చర్చ జరుగుతూనే ఉన్నది.

స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగ చైతన్య వివాహమైన  నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  2017లో వీరిద్దరూ   వైభవంగా పెళ్లి చేసుకున్నారు.  అటు హిందూ సంప్రదాయంలో, ఇటు క్రిస్టియర్ సంప్రదాయంలో పెళ్లి చేసుకొని ఆశ్చర్యపరిచారు. టాలీవుడ్ లో బెస్ట్ పెయిర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వీరి దాంపత్యం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ స్టార్ కపుల్ 2021లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. డైవర్స్ తర్వాత సమంతపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. సమంత చైతూను మోసం చేసిందంటూ మొన్నటి దాకా ఆరోపణలు చేశారు. ఇక నాగ చైతన్య నిశ్చితార్థం కావడంతో  సమంతపై ఆరోపణలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

నాగ చైతన్యే వదిలించుకున్నాడా?

నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేందుకు సమంత 200 కోట్లు భరణం డిమాండ్ చేసినట్లు అప్పట్లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల పై సమంత కూడా స్వయంగా స్పందించింది. బాలీవుడ్ బడా నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ విషయాన్ని వెల్లడించింద. కరణ్ జోహార్ సమంత విడాకులపై, ఆమె తీసుకున్న భరణం వార్తల పై ప్రశ్నలు వేశాడు కరణ్. దీనికి సమంత వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.  రూ.250 కోట్ల భరణం తీసుకున్న..  అందుకే ప్రతి రోజు ఉదయం ఆదాయపు పన్ను అధికారుల కోసం ఇంటి బయట వేచి చూస్తుంటా. కనీసం ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అయినా వాస్తవాలు చూపించగలను’ అంటూ  చెప్పుకొచ్చింది సమంత.

Exit mobile version