Pulwama Attack : పుల్వామా దాడి వేళ మోడీ పాకిస్తాన్ ను భయపెట్టాడా.. అజయ్ బిసారియా పుస్తకంలో అసలు నిజం

Modi during the Pulwama attack

Modi scare Pakistan during the Pulwama attack

Pulwama Attack : పుల్వామా దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ లో భారత వింత్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను శత్రు దేశం పాకిస్తాన్ బంధించి చిత్ర హింసలు పెట్టింది. ఈ పరిణామాలపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ సమయంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మట్లాడాలని ప్రయత్నం చేశారట. అయితే, దీనికి మోడీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాక్ భారత హై కమిషన్ మాజీ అధికారి అజయ్ బిసారియా తన పుస్తకంలో ఈ విషయంతో గురించి వివరించారు.

భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలపై బిసారియా ఒక పుస్తకం రాశాడు. దీనిని ఆయన త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు.. భారత దౌత్య నీతితో పాక్ ఎలా వణికింది? ఉగ్రవాదంపై పాక్ స్టాండ్ ను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? వంటి అనేక అంశాలను ఆయన ఇందులో పొందుపరిచారు. వీటితో కొన్ని అంశాలను ఒక జాతీయ మీడియా టచ్ చేసింది.

‘ఫిబ్రవరి 27వ తేదీ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ సైనికులు బంధించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాది దేశంపైకి ఏకంగా తొమ్మిది క్షిపణులతో యుద్ధానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పాక్‌ భయపడింది. భారత్‌కు అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను ఆ సమాచారం వెంటనే ఢిల్లీ అధికారులకు పంపించాను. ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌ (నా)తోనే మాట్లాడమని చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాక్‌ అధికారులు మళ్లీ నన్ను సంప్రదించలేదు’ అని అజయ్‌ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

‘ఈ పరిణామాలు జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఇమ్రాన్‌ ఖాన్‌ సన్నిహితుడు నన్ను కలిశాడు. ఆ ఏడాది కిర్గిస్థాన్‌లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, ఇమ్రాన్‌ ఖాన్‌ మధ్య భేటీ ఏర్పాటు చేయాలని తనను కోరారు. ఉగ్రవాద కట్టడిపై వారి విధానాలను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మోదీకి వివరించి సర్ధిచెప్తారని చెప్పారు. కానీ భేటీకి ప్రధాని హాజరుకాలేదు’ అని అజయ్‌ వెల్లడించారు.

వర్ధమాన్‌ను విడిపించుకునేందుకు పాక్‌ వైపు క్షిపణులు ఎక్కుపెట్టినట్లు భారత్‌ అధికారికంగా ఎప్పుడూ వెల్లడించలేదు. కానీ, దాని వల్లే అప్పటి ఖాన్‌ ప్రభుత్వం భయపడింది’ అని అజయ్‌ తన పుస్తకంలో రాసుకున్నాడు. 2019 ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసింది. లేదంటే భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది’ అన్నారు.

2019, ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్ర దాడికి ప్రతిగా భారత్ బాలాకోట్‌లో ఉగ్రశిబిరాలపై భారత్‌ వైమానిక దాడులు చేపట్టింది. బాలాకోట్‌ ఘటన  మరుసటి రోజు ఫిబ్రవరి 27వ తేదీ పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌పై దాడికి యత్నించింది. వింగ్‌ కమాండర్‌గా అభినందన్‌ మిగ్‌-21తో వెంటాడి ఎఫ్-16ను నేలకూల్చారు. అదే దాడిలో ఆయన విమానం కూడా కూలిపోయింది. దీంతో పారాచూట్ సాయంతో కిందకు దూకడంతో ఆయన పాక్‌ భూభాగంలో పడిపోయాడు. పాక్‌ సైనికులు అభినందన్ ను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అభినందన్‌ను అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ అతడిని వాఘా వద్ద భారత్‌కు అప్పగించింది.

TAGS