Upasana-Lavanya : మెగా ఫ్యామిలీ లో ఉపాసన కి కూడా దక్కని గౌరవం లావణ్య త్రిపాటికి దక్కిందా?

Mega Family daughter-in-laws

Mega Family daughter-in-laws

Upasana-Lavanya Tripathi : రీసెంట్ గానే పెళ్ళైన క్రేజీ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో మారుమోగిపోతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. వీళ్లకు సంబంధించి ఏ చిన్న వార్త బయటకి వచ్చినా అది సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోతుంది. గతం లో ఇలా సమంత,నాగ చైతన్య జంటకి ఇలాంటి క్రేజ్ ఉండేది. కానీ వరుణ్ – లావణ్య జంట సమంత , నాగచైతన్య జంట క్రేజ్ ని కూడా దాటేసింది అంటున్నారు.

అంతే సొంత కుటుంబం లో కూడా ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కి దొరుకుతున్నంత అదృష్టం ఉపాసనకు కూడా దొరకడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉపాసన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గా మాత్రమే పాపులర్ అయ్యింది. అభిమానులు కేవలం రామ్ చరణ్ ని చూసి ఈమెకి అమితంగా గౌరవం ఇస్తున్నారు.

కానీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లాడక ముందే పెద్ద హీరోయిన్ గా, చేతినిండా అవకాశాలతో దూసుకెళ్లిన హీరోయిన్. అందం పరంగా కూడా ఉపాసన కంటే ఈమెనే వెయ్యి రెట్లు బాగుంటుంది అనేది అక్షర సత్యం. అందుకే అభిమానులు లావణ్య త్రిపాఠి కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు అంటున్నారు ఫ్యాన్స్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆదరణ దక్కించుకోవడం అనేది చిన్న విషయం కాదు. నలుగురు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ ఉన్న హీరోల కుటుంబం అది. ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్ లావణ్య కి సపోర్టుగా ఉంటే ఏ రేంజ్ ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

ఇకపోతే రీసెంట్ గానే ఈమె ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ఫిబ్రవరి రెండవ తేదీ నుండి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాత కూడా ఆమె సినిమాలను కొనసాగిస్తుంది అట. కానీ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట, రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ఇక నుండి చెయ్యబోదట, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గానే ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి సంతకం చేసింది.

TAGS