Kamal Haasan Son : కమల్ హాసన్ కొడుకు అంత దారుణంగా చనిపోయాడా..?
Kamal Haasan Son : సౌత్ ఇండియా లో నటన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్. ఏ నటుడికి అయిన నటనలో కమల్ హాసన్ ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి. ఆ రేంజ్ లో నటించాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడే, కనీస స్థాయిలో అయినా నటించగలం అని నటీనటుల అభిప్రాయం. అందుకే ఆయన మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు, ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు.
ఆయన గత చిత్రం ‘విక్రమ్’ సృష్టించిన బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారుగా 480 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సెన్సేషన్ ని సృష్టించింది. కేవలం తమిళం లో మాత్రమే కాకుండా, తెలుగు, మలయాళం భాషల్లో కూడా తన మార్కెట్ చెక్కు చెదరలేదని కమల్ హాసన్ ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కమల్ హాసన్ తన జీవితం లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.
అప్పట్లో కమల్ హాసన్ దైవం గా భావించే కె బాలచందర్ దర్శకత్వం లో ఒక సినిమా చేసాడట. ఈ సినిమాలో శ్రీ విద్య హీరోయిన్ గా నటించిందట. ఈ సినిమా షూటింగ్ సమయం లో వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది అట. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు కానీ, శ్రీ విద్య తల్లితండ్రులు కమల్ హాసన్ తో పెళ్లి చేయండి ఇష్టపడలేదట. దీంతో వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చిందని, విడిపోయినప్పుడు శ్రీ విద్య మానసికంగా చాలా కృంగిపోయిందని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్ తో ప్రేమలతో పడిందట. ఈ పెళ్ళికి కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు జార్జ్ కేవలం డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, అతనికి అప్పటికే పెళ్లి అయ్యిందని ఆధారాలతో సహా శ్రీ విద్య కి చూపించారట. దీంతో ఆమె రెండవ ప్రేమ కూడా విఫలం అయ్యింది.
అయితే కమల్ హాసన్ తో కలిసి ఉన్నప్పుడు శ్రీ విద్య గర్భం దాల్చిందట. ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిసిన తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి కోసం ఇంట్లో వాళ్లకు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదని, అంతే కాకుండా తనకి అబార్షన్ కూడా చేయించారని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. అబార్షన్ చేసిన డాక్టర్ తనకి ఈ విషయం చెప్పగా నేను చాలా బాదపడ్డాని అని, నాకు పుట్టబోయే మగబిడ్డ బయటకి రాకముందే చనిపోయాడని విషయం తెలుసుకొని కుములిపోయాను అంటూ కమల్ హాసన్ ఎమోషనల్ గా కామెంట్స్ చేసాడు.