JAISW News Telugu

Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ ప్రమోషన్లలో వెనకబడిందా.. తెలుగులో ఓకే.. నార్త్ లో కల్కి వేడేది?

Kalki 2898 AD

Kalki 2898 AD

Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ మూవీకి చేస్తున్న ప్రమోషన్లు సరిపోవడం లేదా.. తెలుగులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రచారం జరిగిపోయింది. ఈ మూవీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ లో నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. అయితే తెలుగు చేసిన చేస్తున్నంత ప్రమోషన్లు ఇతర రాష్ట్రాల్లో చేయడం లేదని తెలుస్తోంది. బయట మార్కెట్ లో మాత్రం కల్కికి అనుకున్నంత ప్రచారం రావడం లేదని తెలుస్తోంది.

ఇప్పటి వరకు తెలుగులో బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ రాలేదు. సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ రేంజ్ సినిమా చేయలేదు. మధ్యలో టిల్లు స్క్వేర్ ఒక్కటే సందడి చేసింది. ఆ తర్వాత పెద్దగా హిట్ రాలేదు. దీంతో కల్కి కోసం తెలుగు సినీ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది.

గతంలో బాహుబలి, ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందు ప్రమోషన్ టైంలో డైరెక్టర్ రాజమౌళి ఎక్కువగా మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూనే దేశమంతా ప్రచారం చేశాడు. ఆయన తో పాటు హిరో, హిరోయిన్లు ఇతర టీం కూడా ప్రచార పర్వంలో పాల్గొనే వారు. కానీ కల్కి టీం మాత్రం దేశ వ్యాప్త ప్రచారంలో వెనకబడిందనే చెప్పొచ్చు. మరో రెండు రోజుల్లో మూవీ రిలీజ్ కానున్న సమయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాంటి డిసెషన్ తీసుకుంటాడో చూడాలి.

అయితే కల్కి 2898 ఏడీకి సంబంధించి తెలుగులో ఫుల్ బుకింగ్స్ నడుస్తున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు బాలీవుడ్ లో మాత్రం పెద్దగా బుకింగ్స్ లేకపోవడం ప్రచారం లో వెనకబడడమే అని తెలుస్తోంది. మరి రిలీజ్ కు రెండు రోజుల సమయం ఉంది. బాలీవుడ్ తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసే ప్రాంతాల్లో కూడా కల్కి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయితేనే మేకర్స్ కు అనుకున్నంత సక్సెస్ అవుతుంది. లేకపోతే కల్కి ప్రమోషన్ లో నాగ్ అశ్విన్ లోపమనే చెప్పాలి. 

Exit mobile version