Johnny Master : జానీ మాస్టర్ హీరోయిన్లను కూడా వేధించాడా?

Johnny Master
జానీ మాస్టర్ ను ఇరికించడానికి పెద్దల హస్తం ఉన్నట్లు దీని వెనక పుష్ఫ సినిమాకు సంబంధించిన తెర వెనక ఉన్న పెద్దలు ఎవరో త్వరలోనే బయటకు తెస్తానని చెప్పారు. జానీ మాస్టర్ ను శ్రేష్ఠ వర్మ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని ఆ సమయంలో తాను సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నం చేసినట్లు జానీ భార్య అయేషా తెలిపింది.
జానీ మాస్టర్ నిర్దోషిగా బయటకు వస్తారు. తప్పంతా శ్రేష్ఠ చేసి ఇప్పుడు తన భర్తపై కేసు పెట్టిందని వాపోయింది. జానీ మాస్టర్ పై మరిన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పటికే జైలులో ఉన్న ఆయన మీద మరిన్ని కేసులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ సమయాల్లో మరో ఇద్దరు హీరోయిన్లతో కూడా జానీ ఇలాగే ప్రవర్తించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వారిద్దరు ఎవరనే విషయం బయటకు తెలియకపోయినా ఈ విషయం నిజమైతే మరిన్ని రోజులు జానీ మాస్టర్ జైలు జీవితం గడపక తప్పదు.
ఇప్పటికే శ్రేష్ఠ వర్మ విషయంలో ఫొక్సో కేసు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు గనక జానీ మాస్టర్ వేధించిన ఆ ఇద్దరు హీరోయిన్లు బయటకు వచ్చి కేసు వేస్తే మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్య మాత్రం ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.