Mahesh Remuneration : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నాడని అందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈగల్ గా ఎదురు చూస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్సాఫీస్ అంచనాలను తలకిందులు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో చర్చల్లో కొనసాగుతున్న ఈ కాంబో వేగంగా సెట్స్ పైకి రాబోతోంది.
ఈ మూవీకి సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ గా మారుతుంది. టైటిల్ విషయంలో అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా.. చాలా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎలాంటి టైటిల్ ఖరారు కాలేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను రూ. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్లు ఇది వరకే టాక్ చెప్పాడు.
సినిమా ప్రారంభంలో రూ. 1000 కోట్లు అనుకున్నప్పటికీ ఆ తర్వాత పెరిగినట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రెమ్యునరేషన్ ఎవరికి ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా జక్కన్న ఎలాంటి సినిమా చేసినా హీరోలకు మిగతా ఆర్టిస్టులకు కూడా ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ ఉంటుంది. బిజినెస్ వ్యవహారాలను నిర్మాతతో పాటు రాజమౌళి కూడా చూసుకుంటాడు. ఈ విషయంలో నిర్మాతకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూస్తుంటాడు. సినిమాకు రెమ్యునరేషన్ గా షేర్ తీసుకుంటాడు జక్కన్న ఒక విధంగా చెప్పుకుంటే ఇది మంచి విషయమే.
జక్కన్న తరహాలోనే మహేశ్ బాబు కూడా వెళ్తున్నాడు. స్టార్ హీరో అని ఇమేజ్ వచ్చినప్పటి నుంచి అదే తరహాలో ప్రతీ సినిమా బిజినెస్ లో వాటా తీసుకుంటున్నాడు. ఇప్పుడు రాజమౌళితో అనేసరికి బిజినెస్ లో షేర్ కాకుండా పారితోషికం తీసుకునే అవకాశం ఉందని టాక్. కానీ, మహేష్ మాత్రం షేర్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు ప్రాఫిట్స్ అందుకున్న మహేశ్ సక్సెస్ లో షేర్ కావాలని అనుకుంటున్నాడు. ఇటు డైరెక్టర్, అటు హీరో కు బిజినెస్ లో వాటా అంటే టాలీవుడ్ లో ఇది కొత్త సంప్రదాయానికి తెర తీస్తుందని చెప్పవచ్చు. రాజమౌళి కూడా ఈ డీల్ కు ఒప్పుకున్నాడట. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా హీరోలకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసిన రాజమౌళి మహేష్ కు మాత్రం ఆ ఫార్మాట్ కొనసాగించలేదు. ఈ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో కాలమే సమాధానం చెప్పాలి.