CM Jagan : జగన్ ఆ మైకంలోకించి బయటికి రాడా?
CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి. ఇప్పటికే ఫలితాలపై ఓ అంచనా కూడా వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అవి కూడా దాదాపు ఫలితాలపై ఓ స్పష్టతనిచ్చాయి. కానీ ఏపీ సీఎం జగన్ ఇంకా తేరుకోవడం లేదు. అధికార మైకంలోకి బయటికి రావడం లేదు. తిరిగి తానే అధికారంలోకి రాబోతున్నానని పగటి కలలు కంటున్నాడు.
ఏపీలో అధికార పార్టీ య వైఎస్సార్ సీపీకి పరాజయం తప్పదని అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. అయితే వైఎస్సార్ సీపీకి చెందిన వారు మాత్రం ఇంకా వైఎస్ జగన్ ను మభ్య పెట్టాలనో, లేక మోసం చేయలనో చూస్తున్నారు. కౌంటింగ్ అయిపోయే వరకూ అలా మాట్లాడాలని ఒప్పందం చేసుకున్నారేమోననే సందేహాలు ఏపీ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జగనే గెలుస్తారని ధైర్యం చెప్పేందుకు అపోసోపాలు పడుతున్నారు .
ఇక సాక్షి మీడియాలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన లోకల్ సర్వేలు, తాడేపల్లి కంపెనీ ఈటీజీ టైమ్స్ నౌలో ఇచ్చిన సర్వే తప్ప ఇంకేవీ కూడా వారికి అనుకూలంగా ప్రకటించలేదు. ఇక తమ ఆస్థాన చానళ్లుగా చెప్పుకునే ఎన్డీటీవీ, ఇండియా టుడే లాంటివి ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అసలే ప్రస్తావించలేదు. అదే సమయంలో ఆరా మస్తాన్ తో అతి కష్టం మీద అయినా గెలుస్తారన్నట్లుగా చెప్పించేందుకు మల్లగుల్లాలు పడ్డారు. ఇక అంతకు మించిన సర్వే లేదన్నట్లుగా తమ ప్రచారం మొదలుపెట్టారు. నాగేశ్వర్ లాంటి ఎనలిస్టులు కూడా తమ క్రెడిబులిటిని తాకట్టు పెట్టేసి ఇప్పటికీ అదే వల్లించడం గర్హనీయం. కౌంటింగ్ ముగిసే దాకా వైసీపీ క్యాడర్ కు నమ్మకం కలిగించాలని భావిస్తున్నారో లేక జగన్ కు ధైర్యం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. చివరికి తెలంగాణకు చెందిన మంత్రి కోమటిరెడ్డి కూడా ఏపీలో జగనే గెలుస్తారని తనకు సమాచారం ఉందంటూ కేసీఆర్, కేటీఆర్ మాటలే చెప్పుకొచ్చారు. ఈ మాటలు జగన ను మోసం చేయడానికే చెబుతున్నట్లుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి.