Shraddha Srinath : సినిమాల్లోకి రాకముందు హీరోయిన్ శ్రద్ద శ్రీనాధ్ అలాంటి పనులు చేసేదా..!
Shraddha Srinath : అందం తో పాటు అద్భుతమైన అభినయం చూపగల అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు శ్రద్ద శ్రీనాథ్. ‘కోహినూర్’ అనే మలయాళం చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రద్ద శ్రీనాథ్, ఆ సినిమా తర్వాత వరుసగా పలు తమిళ సినిమాలతో పాటు, కన్నడ సినిమాలు కూడా చేసింది. తెలుగు ఆడియన్స్ కి ఆమె మొట్టమొదట పరిచయమైంది మాత్రం నాని హీరో గా నటించిన ‘జెర్సీ’ సినిమాతోనే. నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం లో శ్రద్ద శ్రీనాథ్ నటన సినిమాకి ప్రధాన హైలైట్స్ లో ఒకటిగా నిల్చింది.
ఆ సినిమాకి కల్ట్ క్లాసిక్ స్టేటస్ వచ్చిందంటే అందులో శ్రద్ద శ్రీనాథ్ పాత్ర ఎంతో ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా నటనకి ప్రాధాన్యత ఉన్న రోల్స్ ని మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు సాగింది.
రీసెంట్ గా ఆమె విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంధవ్’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులో శ్రద్ద శ్రీనివాస్ పాత్రకి కూడా మంచి పేరొచ్చింది. అది పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ ఎలా మొదలైంది అనే విషయాన్నీ చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకముందు శ్రద్ద శ్రీనాథ్ ఒక లాయర్ అట. బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ కి లీగల్ సెల్ లో ఒక లాయర్ గా పనిచేసిందట. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీ కి కూడా లీగల్ అడ్వైజర్ గా చేసిందట. అలా ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ చేస్తూ నెట్టుకొస్తున్న శ్రద్దా శ్రీనాథ్ కి ఒక యాడ్ లో నటించే అవకాశం దక్కిందట.
నో చెప్పకుండా ఒకసారి చేసి చూద్దాం అని ట్రై చేసిందట. ఆ యాడ్ బాగా వైరల్ అవ్వడంతో శ్రద్ద శ్రీనాథ్ కి మరికొన్ని యాడ్ ఆఫర్లు వచ్చాయట. అలా ఒక పక్క జాబ్ చేస్తూ మరోపక్క యాడ్స్ చేస్తూ జీవితం కొనసాగిస్తున్న ఆమెకి సినిమాల్లో అవకాశాలు రావడం, ఉద్యోగం వదిలేసి సినిమాల్లోనే కొనసాగుతూ నేడు సౌత్ లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరిగా నిలవడం వంటివి జరిగాయి. ప్రస్తుతం ఈమె కన్నడలో ఒక సినిమా, తమిళం లో ఒక సినిమా అలాగే హిందీ లో ఒక సినిమా చేసింది.