Cross the Vande Bharat Train : వందే భారత్ రైలు దాటేందుకు అతడు అంత పని చేశాడా? వైరల్ వీడియో

Cross the Vande Bharat Train

Cross the Vande Bharat Train Viral Video

Cross the Vande Bharat Train Viral Video : మనం కొన్ని సార్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోం. ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంటాం. దీంతో ప్రమాదాల బారిన పడుతుంటాం. మనకు తెలియకుండానే ప్రాణాలే పోయే సంఘటనలు ఎదురవుతాయి. అది ప్రమాదం అని తెలిసినా తప్పించుకుంటామనే ధీమాలో ఉంటారు. తీరా జరగాల్సిన నష్టం జరిగితే ప్రాణాలు మాత్రం గాల్లో కలవడం ఖాయం. అందుకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.

కేరళలోని తిరువనంతపురం లో జరిగిన ఓ ఘటన మనకు షాక్ కు గురిచేస్తుంది. రెప్పపాటులో ఓ ముసలివాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇది నిజంగా సాహసమే అని చెప్పాలి. కానీ ఎవరు పట్టించుకోరు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రమాదాలను దాటుతుంటారు. రెప్పపాటులో మన జీవం పోయే అవకాశం ఉంటుందని తెలిసినా నిర్లక్ష్యంతోనే ఉంటారు.

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎంత వేగంగా వెళ్తుందో మనకు తెలుసు. రెప్పపాటులోనే అది వేల మైళ్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. దీంతో అది వస్తుందంటే ప్లాట్ ఫాం మీద ఉన్న వారికి గుబులే. ఎక్కడ ఢీకొంటుందనే బెంగ అందరిలో కలుగుతుంది. తిరువనంతపురం నుంచి కాసర్ గాడ్ కు వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ తిరూర్ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తోంది. ఆ రైలుకు అక్కడ హాల్ట్ లేదు. ఇంకేముంది వేగంగా వస్తోంది. 110 కిలోమీటర్ల స్పీడుతో స్టేషన్ దాటుతుంది.

ఆపాటికే రైలు ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. దీంతో ఆ ముసలివాడు క్షణాల్లో ప్లాట్ ఫాం దాటాడు. అక్కడున్న వారంతా పరేషాన్ అయ్యారు. మనిషికో మాట అన్నారు. ముసలివాడు చేసిన పని అందరిని పరేషాన్ కు గురి చేసింది. రైలు రావడంతో ఒక్క క్షణం ముందయితే నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు.

రైలు అత్యంత వేగంతో వెళ్తుంది. దాని వేగం చూస్తే భయం వేస్తుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. అది ఎంత వేగంగా వెళ్తుందో తెలుసుకోవచ్చు. ప్లాట్ఫాం దాటిన వృద్ధుడిని ఒట్టపాళెంకు చెందిన వ్యక్తిగా కనుగొన్నారు. అతడు తనకు అనారోగ్యం కలగడంతో చికిత్స చేయించుకోవడానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఇలా రైలు పట్టాలు దాటి అందరిలో గుబులు రేపాడు.

TAGS