Hardik Pandya Wife : హర్దిక్ పాండ్యా టీం ఇండియా వైస్ కెప్టెన్. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. హర్దిక్ 2020 కొవిడ్ టైంలో గుట్టు చప్పుడు కాకుండా నటషా స్టాంకోవిచ్ అనే బాలీవుడ్ హిరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరికి పెళ్లి ముందే కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు ఆగస్త్య పాండే అని నామకరణం చేశారు.
నటాషా హర్దిక్ తో పెళ్లి కి ముందు టీవీ నటుడు అలీ గోనీతో డేటింగ్ చేసింది. అప్పుడు వీరి జంట చెట్టా పట్టాలు వేసుకుని తిరిగింది. కానీ పెళ్లి చేసుకునే టైంలో వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే హర్దిక్ పాండ్యా తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత హర్దిక్ పాండ్యా ను పెళ్లి చేసుకుంది.
నటాషా స్టాంకోవిచ్ 1992 లో సెర్బియాలో పుట్టింది. నటాషా హర్దిక్ పాండ్యాను క్రిస్టియన్, హిందూ పద్ధతిలో రెండింట్లో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఉదయ్ పూర్ లోని ఫేమస్ రాజకోటలో అంగరంగ వైభవంగా జరిగింది. నటాషా, అజయ్ దేవ్ గణ్, కరీనా కపూర్, అమితాబ్ బచ్చన్ నటించినా సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్ లో అరంగ్రేటం చేసింది. నటాషా సెర్బియాలో పుట్టి పెరిగింది. పలు డ్యాన్స్ షోలు, రియాల్టీ షోలలో పాల్గొంది.
నటాషా హర్దిక్ పాండ్యా కంటే వయసులో ఏడాదిన్నర పెద్దది కావడం విశేషం.
హర్దిక్ పాండ్యా కాకుండా చాలా మంది భారత క్రికెటర్లు బాలీవుడ్ సెలబ్రేటీలతో డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకుని సెటిల్ అయిన వాళ్లు ఉన్నారు. విరాట్ అనుష్క, హర్బజన్ గీతా, జహీర్ ఖాన్ లాంటి వాళ్లు బాలీవుడ్ హిరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. దీపికా పదుకొనే కూడా మొదట్లో యువరాజ్ సింగ్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులకు దూరమైంది. చాలా మంది ఇండియన్ క్రికెటర్లతో రహస్యంగా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నా అవేవీ పట్టించుకోకుండానే సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.