JAISW News Telugu

Director Sukumar : డైరెక్టర్ సుకుమార్ కు హెల్త్ ఇష్యూష్ వచ్చాయా? 

Director Sukumar

Director Sukumar

Director Sukumar : డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సుకుమార్ పుష్ప 2 సినిమాను తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు తెప్పించే చిత్రంగా నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం నిద్రాహారాలు మాని తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే పుష్ప ది రూల్ తో పాన్ ఇండియా లెవల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా విడుదల కానుంది.
అయితే ముందుగా అనుకున్న విడుదల తేదీ ఆగస్టు 15 కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో మిగతా షూటింగ్, తదనంతర పనులు హుషారుగా సాగుతున్నాయి. వీటిని సుకుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సినిమాలో 1500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2 లాంటి చిత్రాలు కూడా ఈ కలెక్షన్ లను చేరుకోలేకపోయినట్లు సమాచారం.
సుకుమార్ సరికొత్తగా పుష్ప  2 ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కథతో పాటు సినిమాలో సరికొత్త సన్నివేశాలు ఆసక్తికరంగా అద్భుతంగా తీస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. అయితే ఈ సమయంలో సుకుమార్ కు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అయినా ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కేవలం సినిమానే ప్రాణంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
హాస్పిటల్ కు వెళ్లి చెక్ చేయించుకోకుండా కేవలం టాబ్లెట్లు వేసుకుని తగ్గించుకుని షూటింగ్ లలో పాల్గొంటూ తన డెడికెషన్ చాటుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే పుష్ప 2 పై సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఫుల్ హోప్స్ పెట్టుకున్నట్లు సమాచారం.  సెకండ్ హాప్ లో అనసూయ, సునీల్ తో పాటు పహాద్ పాజిల్ యాక్టింగ్ కూడా దిమ్మ తిరిగి పోయేలా ఉందని అనుకుంటున్నారు. మరి పుష్ప 2 రిలీజ్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Exit mobile version