Attitude star : దేవర వల్లే కోట్లలో నష్టపోయా.. యాటిట్యూడ్ స్టార్ తండ్రి సంచలన ఆరోపణలు..!

Attitude star

Attitude star

Attitude star : బుల్లితెర సూపర్ స్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా రామ్ నగర్ బన్నీ చిత్రాన్నినిర్మించారు. కాగా ఎన్టీఆర్ సినిమా దేవర విడుదలైన రోజే రామ్ నగర్ బన్నీ కూడా రిలీజ్ కాగా ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తీయాలని అనుకున్నప్పుడు ప్రభాకర్ కేవలం రూ. 3 కోట్లతో పూర్తి చేయాలని భావించారంటా..  సినిమా పూర్తయ్యే సరికి రూ. 5 కోట్ల వరకు ఖర్చయిందని చెప్పుకొచ్చాడు.

రామ్ నగర్ బన్నీసినిమా విడుదల సమయంలో దేవర రావడంతో చంద్రహాస్ సినిమాకు వసూళ్లు నిలిచిపోయాయి. దీనికి తోడు యాటిట్యూట్ స్టార్ గా నిలవడంతో ప్రేక్షకులకు పెద్ద స్టప్ దొరికినట్లయింది. ప్రభాకర్ బుల్లితెర లో మెగాస్టార్ గా నిలిచాడు. ఆయన ఇటు సినిమాలు చేస్తూనే అటు సీరియల్స్ లో నటించాడు. సీరియల్స్ ద్వారా బాగా సంపాదించాడు. ప్రభాకర్ కొడుకు సినిమాల మీద ఇంట్రస్ట్ చూపడంతో అతడిని సినిమాల్లో యాక్ట్ చేసేందుకు ట్రైనింగ్ కూడా ఇప్పించాడు.

ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ చూపించిన యాటిట్యూడ్ తో పూర్తిగా ట్రోల్ అయ్యాడు. సినిమా లు విడుదల కాకముందే స్టేజీపైన మాట్లాడిన మాటలు చాలా మందికి చిరాకు తెప్పించాయి. వీడెంటి ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఏకిపారేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి కొడుకులే ఇలా ప్రవర్తించలేదు. మీ నాన్న బుల్లితెర హీరో అయితే ఇలా ప్రవర్తించాలా అంటూ చురకలంటించారు. రామ్ నగర్ బన్నీ సినిమా ఆడకపోవడానికి కారణం దేవర అని తాజాగా ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

దేవర సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో మా సినిమాకు నిరాశ ఎదురైందన్నారు.  దీంతో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తారని ప్రేక్షకులు ట్రోల్స్ చేస్తున్నారు. ఇకనైనా యాటిట్యూట్ తగ్గించుకుని మంచి కథలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

TAGS