Cricketer Shami : టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీ తన బౌలింగ్ తోొ 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు. క్రికెటర్ గా షమీ సక్సెస్ ఫుల్ అయినా.. పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2018 లో తన భార్య తో వచ్చిన విభేదాలు, ఫిక్సింగ్ ఆరోపణలతో తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నడని అతడి ఫ్రెండ్ ఉమేశ్ కుమార్ సంచలన విషయం బయటపెట్టాడు.
ఉమేశ్ కుమార్ ఫ్లాట్ 19 వ అంతస్తులో ఉండగా.. ఒక రోజు తన ప్లాట్ కు వచ్చిన షమీ తెల్లవారుజామున బాల్కనీ వద్ద ఒక్కడే ఉన్నాడని ఆ సమయంలో అతడికి సూసైడ్ ఆలోచనలు వచ్చాయని పేర్కొన్నాడు. కానీ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ షమీకి క్లీన్ చీట్ ఇచ్చారు. షమీ మీడియా ముందుకు వచ్చి తాను ఇప్పుడున్న పరిస్థితి ఒకే. ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో చాలా కుంగిపోయాను.
షమీ ఒకానొక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. జీవితంలో తమ ప్రాధాన్యం తెలుసుకుని ప్రవర్తించాలి. నిందలు వేయడానికి ఆరోపణలు చేయడానికి రెడీ ఉంటారు. వాటన్నింటినీ పట్టించుకుని ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదని అన్నాడు. షమీ 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీం ఇండియా జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకుని ముందుకు సాగుతున్నాడు. జట్టులోకి రావడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టు మ్యాచులకు షమీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. క్రికెటర్లతో పాటు సెలబ్రెటీలు కూడా చాలా మంది డిప్రెషన్ కు గురవుతుంటారు. ఇలాంటి సందర్భంలో వారికి మంచి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలినా ఎదుర్కొని బయటపడొచ్చు. దీనికి ఉదాహరణే షమీ అని చెప్పొచ్చు.