JAISW News Telugu

Bejawada Bebakka : బెజవాడ బేబక్క చేసిన పనికి కంటెస్టెంట్ లు కొట్టుకున్నంత పని చేశారు? ఏంటా పని

Bejawada Bebakka

Bejawada Bebakka

Bejawada Bebakka : బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల హడవిడి మొదలైంది. కిచెన్ లో చిన్న సంఘటన జరగ్గా దాన్ని బేస్ చేసుకుని బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాషా. నామినేషన్ సమయంలో బేబక్కను నామినేట్ చేస్తూ పృథ్వీ ని చూస్తూ చెప్పాడు. దీంతో పృథ్వీ కూడా ఎందుకు నా వైపు చూస్తున్నవ్ అంటూ చేయడంతో శేఖర్ భాషాకు, పృథ్వీకి మధ్య వాదన జరిగింది.

సోనియాకు నామినేషన్ చేయడానికి ముందుగా అవకాశం వచ్చింది. సోనియా బేబక్క, ప్రేరణను ఇద్దరిని నామినేట్ చేసేసింది. ఈ తర్వాత బిగ్ బాస్ చీఫ్ గా యష్మికీ అవకాశం రావడంతో ప్రేరణను నామినేషన్స్ నుంచి బయట పడేశారు. బేబక్కను అలాగే ఉంచేశారు. ఆ తర్వాత నాగమణికంఠ, శేఖర్ భాషాలు కూడా నామినేట్ అయ్యారు. కాగా ఇక్కడ వాడీవేడిగా డిస్కషన్ జరిగింది.

అయితే బేబక్కను కేవలం కిచెన్ లో కాఫీ ఇవ్వలేదని నామినేట్ చేశాడు శేఖర్ భాషా.. దీంతో బేబక్క తో కాకుండా పృథ్వీతో వాదన ప్రారంభమై అది పెరిగి పెద్దదైంది. నామినేషన్ లో మాట్లొడొచ్చు.. బిగ్ బాస్ మాట్లాడకూడదని రూల్ ఏం పెట్టలేదు. బెజవాడ బేబక్క అనంతరం పృథ్వీని నామినేట్ చేసి కాఫీ కావాలంటే అడుగుతారు.

కానీ ఎలాంటి హెల్ఫ్ చేయరు అంటూ విమర్శించింది. అయితే ఇందులో కిరాక్ సీత తలదూర్చి గిన్నెలు కడిగావు, కూరగాయలు కట్ చేశావ్ అని చెప్పొచ్చు కదా అంటూ సలహా ఇచ్చింది పృథ్వీకి . అయితే మధ్యలో తల దూర్చకు అంటూ సీతకు నిఖిల్ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో నిఖిల్, కిరాక్ సీతకు ఇద్దరి మధ్య చాలా హాట్ హాట్ డిస్కషన్ జరిగిపోయింది.

ఇలా బేబక్క కేవలం కాఫీ కోసం నామినేట్ చేయడం ఏంటని అందరూ అనుకున్నారు. చివరకు గతంలో పాల కూర పప్పు గురించి జరిగిన హాట్ డిస్కషన్ తో ఒక ఫేమస్ నటి ఎలిమినేట్ అయ్యారు. చివరకు బేబక్క కూడా అలానే నామినేట్ అవడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

Exit mobile version