JAISW News Telugu

West Bengal : పశ్చిమ బెంగాల్ లో నియంతృత్వం..బీజేపీ జెండా కూడా పెట్టనివ్వకుండా..

West Bengal

West Bengal

West Bengal : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సాగుతున్నాయి. ఇవాళ నాలుగో దశ ఎన్నికలు పలు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలంటేనే ఓ సెలబ్రేషన్స్. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికలంటేనే  హింస, దాడులు. ఏపీలో అధికార వైసీపీ దారుణాలు మనం చూస్తేనే ఉన్నాం. ప్రత్యర్థులపైనే కాదు ఓటర్లపై వైసీపీ గూండాల దాడులు చూశాం. పలు చోట్ల తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలపై, రాజకీయ నాయకులపై దాడులు తెగబడ్డారు. సమస్యలపై నిలదీసిన మహిళలపై వైసీపీ నాయకులు దాడులు చేసిన వార్తలు మనం చదివే ఉన్నాం.

ఇక మన ఏపీ సంగతి ఇలా ఉంటే పశ్చిమ బెంగాల్ లో మరీ దారుణం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతటా సమస్యాత్మకమే అని చెప్పవచ్చు. అయితే అక్కడ మత ప్రమేయ దాడులు ఎక్కువ. అధికార తృణమూల్ పార్టీ నాయకులు, నేతల అండ చూసుకుని బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం నిత్యకృత్యమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ సామాన్య దుకాణదారుడు తన షాపు ఎదుట బీజేపీ జెండాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే అటు వైపుగా వెళ్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంపు ఒకటి ఆ జెండాను చూసింది. వెంటనే షాపు దగ్గరకు వెళ్లి ఆ జెండాలను పీకివేయడమే కాకుండా..ఆ వ్యాపారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వీడియోను చూసిన ప్రజాస్వామికవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేనా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం. ఓ పార్టీ జెండా పెట్టుకోవడమే తప్పా..ఆ మాత్రం స్వేచ్ఛ ప్రజలకు లేదా..అంటూ కామెంట్ చేస్తున్నారు. తృణమూల్ పాలనలో ఓ వర్గంపై ఇలా బహిరంగంగా దాడులు చేస్తుంటే అక్కడి అధికారులు ఏం చేస్తున్నారు. ఇదేనా రాజ్యాంగ పరిరక్షణ అని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ జెండా కూడా పెట్టుకోవద్దా అంటున్నారు. మమతా నియంతృత్వం ఇంకెన్నాళ్లు అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Exit mobile version