Dhanush : ఫిలిం ఇండస్ర్టీలో మరో వివాదం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్; లేడి సూపర్ స్టార్ నయనతార మధ్య విభేధాలు రాజుకున్నాయి. ఈ విషయం నయనతర పోస్ట్ చేసిన మూడు పేజీల లేఖతో బయటపడింది..
లేడి సూపర్ స్టార్ నయనతార గతంలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నేను రౌడీనే(నాన్ దా రౌడీ) చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకు దర్శకుడు విఘ్నేష్. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయన తార, విఘ్నేష్ ప్రేమించుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఇదంతా గతం. కానీ ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వివాదం మొదలైంది.
నయన తార, విఘ్నేష్ ల పెళ్లి కి సంబంధించి డాక్యుమెంటరీ తీశారు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్. అయితే ఈ డాక్యుమెంటరీలో నేను రౌడీనే చిత్రంలోని ఓ క్లిప్ ను తన అనుమతి లేకుండా వాడారంటూ హీరో ధనుష్ కోర్టు నోటీసులు పంపారు. తనకు రూ. 10 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై నయనతార మండిపడ్డారు. నీ లాగా అన్న, తండ్రి సపోర్ట్ తో సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోలేదని, సొంతంగా ఎదిగానని ఇన్ స్టా గ్రామ్ లో ఓ లేఖ పోస్ట్ చేశారు. మహిళలు సొంతంగా ఎదిగితే జీర్ణించుకోలేకపోతున్నావంటూ మండిపడ్డారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో మొబైల్ తీసిన వీడియోలకు కూడా జరిమానా వేస్తావా.. మరీ ఇంత దిగజారిపోయావేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చేసిన పనని తమిళ ప్రేక్షకులు అంగీకరిస్తారని తాను భావించడం లేదని పేర్కొన్నారు.