JAISW News Telugu

Dhamaka Director : నిర్మాతగా మారిన ‘ధమాకా’ డైరెక్టర్.. కొత్త సినిమా టీజర్ అదిరిపోయింది గా!

Dhamaka Director

Dhamaka Director

Dhamaka Director : మీడియం రేంజ్ హీరోలకు మినిమం గ్యారంటీ అనిపించే దర్శకులలో ఒకడు త్రినాథ రావు నక్కిన. ఈయన వరుణ్ సందేశ్ హీరో గా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మేము వయస్సుకి వచ్చాం’, ‘నువ్వలా నేనిలా’, ‘సినిమా చూపిస్తావా మావ’ అనే సినిమాలు తీసాడు. వీటిల్లో ‘సినిమా చూపిస్తా మావ’ అనే సినిమా ఎంత పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’  మరియు ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో క్రేజీ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు. ధమాకా వంటి హిట్ తర్వాత నక్కిన ఏ సినిమా చెయ్యబోతున్నాడు అనే దానిపై నిన్న మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ ఉండేది కాదు.

అయితే ఇప్పుడు ఆయన దర్శకుడిగా కాకుండా నిర్మాతగా మారాడు. నక్కిన న్యారేటివ్స్ అనే నిర్మాణ సంస్థ ని ప్రారంభించి ‘చౌర్య పాఠం’ అనే సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ నటిస్తున్నారు. ఇద్దరూ కూడా కొత్తవాళ్లే. దర్శకుడు నిఖిల్ గోళ్లమూరి అనే వ్యక్తి కూడా ఇండస్ట్రీ కి కొత్తవాడే. ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ఎలా ఉందో ఒకసారి చూస్తే, ఒక యూత్ బ్యాచ్ గ్రామీణ బ్యాంక్ ని దోపిడీ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకున్నారు. ఎవరి రూల్స్ వాళ్ళవే, ఎవరి ప్లాన్స్ వాళ్ళవే, ఇలా తెలివి తక్కువ తనం తో వీళ్ళు దోపిడీ చేయాలనుకునే సంఘటనలు చూస్తే నవ్వు వచ్చేలా అనిపిస్తున్నాయి.

చూస్తూ ఉంటే నిర్మాతగా కూడా త్రినాథ రావు నక్కిన సక్సెస్ కొట్టేలాగానే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఈగల్ మూవీ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని వ్యవహరించాడు. డైరెక్టర్ గా రవితేజ లాంటి హీరో తో సినిమా చేసి కూడా వేరే డైరెక్టర్ సినిమాకి సినిమాటోగ్రఫీ చెయ్యడం అనేది చిన్న విషయం కాదు.  మరి ఈ సినిమాతో నిర్మాతగా కూడా త్రినాథరావు నక్కిన సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Exit mobile version