Devullu Movie Baby : దేవుళ్లు మూవీ బేబీ అందాలు కిరాక్ భయ్యా!

Devullu Movie Baby
Devullu Movie Baby : తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ కు ఆద్యుడు కోడి రామకృష్ణ అని చెప్పాలి. ఇప్పుడు మనకు రాజమౌళి అనుకుంటాం కానీ ఆయనకన్నా ముందే భారీ గ్రాఫిక్స్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ లు కొట్టింది కోడి రామకృష్ణనే. సోషియో ఫాంటసీ దమ్మున్న కథలతో ఆయన సినిమాలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. అమ్మోరు, దేవి, అంజి, దేవుళ్లు, అరుంధంతి..ఇవన్నీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చి కోట్ల వర్షం కురిపించినవే.
ఆయన సూపర్ హిట్ మూవీల్లో ఒకటైన ‘దేవుళ్లు’ 2000లో సంవత్సరంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్టార్ హీరోలు లేకున్నా ఇద్దరు చిన్న పిల్లలే స్టార్లుగా తీసిని ఈ మూవీ చిన్నా పెద్దా అందరినీ అలరించింది. ఈ సినిమాలోని ప్రతీ పాట హిట్టే. ఇప్పటికీ ఈ పాటలు ఆలయాలు, గణేష్ మండపాల్లో వినిపిస్తూనే ఉంటాయి. అలాగే మంచి కథ, గ్రాఫిక్స్..ఇలా అన్నీ బాగా కుదిరాయి కాబట్టే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇందులో మాస్టర్ నందన్, బేబి నిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను దాదాపు అందరూ చూసే ఉంటారు కాబట్టి కథను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో నటించిన బేబి నిత్య ఇప్పుడెలా ఉందో మీకు తెలుసా? ఈ చిన్నది ప్రస్తుతం హీరోయిన్ గా మారింది. తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ బేబి ఇప్పటికే పలు సినిమాల్లో నటించి అందాలు ఆరబోస్తోంది. నువ్వు తోపురా.. పిట్టకథ, వాంటెడ్ పండుగాడు.. వంటి సినిమాల్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్. నిత్యా శెట్టిగా హాట్ హాట్ ఫొటోలు, అదిరిపోయే వీడియోలతో యూత్ కు కిరాక్ తెప్పిస్తోంది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఓ మంచి అవకాశం వస్తే మాత్రం తాను ఏంటో ప్రూఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది.
View this post on Instagram