
MP Purandeshwari
MP Purandeshwari : కొవ్వూరు-భద్రాచలం మధ్య రైలు మార్గం అభివృద్ధి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి విన్నవించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన పురందేశ్వరి సోమవారం రైల్వే శాఖ మంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధితోపాటు రైల్వే పరంగా ఇతర సమస్యలపై చర్చించారు. రూ.923.23 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం-కొవ్వూరు మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ 2012లో అంగీకరించాయని మంత్రి దృషంటికి తీసుకువెళ్లారు.