Devarakonda : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో హీరో లేదంటే ఒక్కో నటుడు సెంటిమెంట్ గా ఉంటారు. అలాగే నాగ్ అశ్విన్ కు విజయ్ ఓ సెంటిమెంట్ గా మారాడు. ఇప్పటి వరకు అశ్విన్ చేసిన అన్ని సినిమాల్లో విజయ్ కనిపించాడు. అదే సంప్రదాయం కల్కితో కూడా కంటిన్యూ చేశారు. ‘కల్కి’లో ఓ చిన్న కేమియో చేశాడు విజయ్ దేవరకొండ. ‘కల్కి2’లో తన పాత్ర ఉందని చెప్పుకస్తున్నాడు. ఈ సారి ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ‘కల్కి’ రిలీజ్ రోజున రిజల్ట్ చూసి విజయ్ ఖుషీ అయ్యాడు. ఇండియన్ సినిమాని నాగ్ అశ్విన్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాడని ట్వీట్ చేశాడు.
ఆయన చెప్పిన మరో విషయం రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని కూడా జోస్యం చెప్పాడు. ఇది కూడా నిజమైంది. ‘కల్కి’ రూ.1000 కోట్ల మైలు రాయిని అందుకుందని సాక్షాత్తు బిగ్ బీ ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. రూ.1000 కోట్ల సినిమా చేయడం ప్రభాస్ కు ఇది రెండోది ‘బాహుబలి 2’ తర్వాత.. ప్రభాస్ ఈ మైలు స్టోన్ సాధించినట్టైంది.
‘కల్కి’ సక్సెస్ మీట్ భారీగా నిర్వహించాలని ‘వైజయంతీ మూవీస్’ భావించింది. కానీ ప్రమోషన్ల హడావుడిలో ఇది కుదరలేదు. ఇప్పటికే అశ్వినీదత్, ప్రయాకాదత్ ప్రమోషన్ లోనే బిజీగా కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తారు. ఇక్కడికి వచ్చాక ‘కల్కి’ సక్సెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.
సక్సెస్ ఈవెంట్ ను ముంబైలో చేయాలని అనుకున్నారు. దాన్ని హైదరాబాద్ కు లేదంటే అమరావతికి మార్చాలని అనుకుంటున్నారు. వైజయంతీ మూవీస్ 50 వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో వేడుక మరింత గ్రాండ్ గా ఉండాలని అశ్వినీదత్ ఫిక్స్ అయ్యారు.