Devara : ‘దేవర’ టీజర్ లో మీరెవ్వరు గమనించని అద్భుతమైన విషయాలు..కొరటాల ప్లానింగ్ మాములుగా లేదు!
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ కి సంబంధించిన మొదటి గ్లిమ్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన క్వాలిటీ తో ఈ గ్లిమ్స్ వీడియో తెలుగు తో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదలైంది. ఈ గ్లిమ్స్ వీడియో లో ఎన్టీఆర్ ని చాలా కొత్తగా చూపించాడు. ఆయన లుక్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా కొన్ని షాట్ మేకింగ్స్ అయితే కొరటాల రాజమౌళి రేంజ్ ఎఫ్ర్ట్స్ పెట్టాడనే చెప్పాలి.
ముఖ్యంగా ప్రారంభం లో వచ్చే కంటైనెర్స్, దానిపైన రౌడీ మూకలు పరిగెత్తడం, అండర్ వాటర్ నుండి పైకి రక్తం ఉప్పెన లా పొంగడం వంటివి చూస్తే అసలు ఈ సినిమాకి డైరెక్టర్ నిజంగా కొరటాల శివ యేనా అనిపించింది. ఎందుకంటే ఆయన గత చిత్రాలను మొత్తం తీసుకుంటే కేవలం సందేశాలు ఉంటాయి. ఇక ‘దేవర’ కి ముందు ఆయన చేసిన ‘ఆచార్య’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఆ రేంజ్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తదుపరి చిత్రానికి ఈ రేంజ్ టేకింగ్ లో సినిమాని తీస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గతం లో ‘జై లవ కుశ’ అనే సినిమా తీసింది. ఈ సినిమా ఎంత చీప్ క్వాలిటీ తో తీశారో మన అందరం చూసాము. అలాంటి నిర్మాణ సంస్థ నుండి ఇలాంటి క్వాలిటీ ని ఎవ్వరూ ఊహించలేదు. ఎన్టీఆర్ గ్లిమ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఊచకోత కోస్తున్నప్పుడు రక్తం గాల్లోకి ఎగిరి నిండు చంద్రుడి లాగ కనిపించడం బాగుంది. ఆ తర్వాత చివర్లో ఎన్టీఆర్ కొండ రాయు మీద కూర్చొని డైలాగ్ చెప్పిన తర్వాత సముద్రపు అలలు పైకి ఎగిరినప్పుడు, రక్తపు నీళ్లు కూడా కనిపించడం ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని రప్పించింది అనే చెప్పాలి.
కానీ డైలాగ్ మాత్రం కేజీఎఫ్ ని ఆదర్శంగా తీసుకొని రాసినట్టు ఉన్నాడు కొరటాల. ‘ఈ సముద్రం చేపలకంటే కత్తుల్ని, నెత్తురుని ఎక్కువగా చూసి ఉండాలి. అందుకే దీనిని ఎర్ర సముద్రం’ అని అంటాడు ఎన్టీఆర్. ఇదే తరహా డైలాగ్ కేజీఎఫ్ లో ‘అధీర’ కత్తి బయటపడినప్పుడు వానరం చెప్తాడు. ఓవరాల్ గా గ్లిమ్స్ వీడియో బాగానే ఉంది కానీ, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చివర్లో తప్ప, మిగతా మొత్తం యావరేజి గానే అనిపించింది.