Devara : 5వ రోజు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న దేవర
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ సినిమా దేవరకు ఆదివారం నుంచి కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. రిలీజైన వీకెండ్ వరకు కలెక్షన్లు బాగానే ఉన్నా సోమవారం చాలా వరకు పడిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం గాంధీ జయంతి కావడంతో అన్ని భాషల్లో ముఖ్యంగా హిందీలో కలెక్షన్లు పెరిగాయి.
ఇండస్ట్రీ ట్రాకర్ సర్కిల్స్ ప్రకారం.. దేవర పార్ట్ 1 మంగళవారం రూ. 13.5 కోట్లు వసూలు చేసింది, అంటే సోమవారం కంటే కూడా కొంత మెరుగు కలెక్షన్లను రాబట్టిందని చెప్పవచ్చు. సోమవారం రూ. 12.75 కోట్ల వసూళ్లతో గణనీయమైన క్షీణతను చూసింది. బుధవారం జాతీయ సెలవు దినం కావడంతో దేవర ఈవినింగ్, సెకండ్ షోలకు కలెక్షన్లు గణనీయంగా పెరగడంతో బుధవారం మరింత పటిష్టమైన సంఖ్యకు రంగం సిద్ధమైంది.
ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ. 186 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 267 కోట్లకు చేరువగా ఉంది. ఈ సినిమా ఒరిజినల్ తెలుగు వెర్షన్ రూ. 8 కోట్లు వసూలు చేయగా.. హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసింది. దేవర: పార్ట్ 1 హిందీ వెర్షన్ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ పర్ఫామెన్స్ కొనసాగించింది. మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ, దేవర: పార్ట్ 1 ప్రేక్షకులను, మాస్ ఆడియన్స్ ను ఎక్కువ ఆకర్షిస్తుంది.
ముఖ్యంగా పెద్దగా రిలీజ్ లు లేకపోవడంతో సెకండ్ వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో ఈ సినిమా ఈ వారం మొత్తం ట్రెండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.