Devara song : దేవర సాంగ్ చుట్టమల్లే పాడింది తెలుగు గాయనే.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

Devara song

Devara song

Devara song : దేవర మూవీలో చుట్టమల్లే సాంగ్ ను రిలీజ్ చేయగా.. పబ్లిక్ లో అది దూసుకుపోతుంది.  కాగా ఈ పాట పాడింది ఎవరూ అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మన తెలుగు అమ్మాయే అని తెలుసుకుని మురిసిపోతున్నారు. శిల్పారావు గాయని కాగా ఇప్పటి వరకు అనేక హిందీ సినిమాల్లో పాటలు పాడింది. ఈమె జంషెడ్ పూర్ లో జన్మించింది.

ఈమె తండ్రి ఉద్యోగ రీత్యా జంషెడ్ పూర్ లో సెటిల్ అయ్యారు. శిల్పారావు మొదటి పేరు అపేక్షరావు కాగా తర్వాత శిల్పారావుగా మార్చారు. శిల్పారావు 1984 సంవత్సరంలో జన్మించింది. ఈమె గతంలో నేపథ్య గాయనిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈమె సంగీత విధ్వంసుడు ఇళయరాజాతో కూడా పనిచేసింది. 2012 లో జబ్ తక్ హైజాన్ సినిమాలో ఇష్క్ షావా అనే పాటలో ఎఆర్ రెహమన్ తో కలిసి పని చేసింది. ఈమె పాకిస్థాన్ లో కూడా తన గానంతో ప్రదర్శన చేసింది.
 చివరిగా పాకిస్థాన్ లో పాడిన గాయని శిల్పారావు కావడం గమనార్హం. శిల్పారావు తన పాటలతో పాటు కొత్త కొత్త స్టైల్స్ ను ఎంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఏఆర్ రెహమన్, ఇళయరాజా, లాంటి పెద్ద సంగీత దర్శకులు కూడా పిలిచి ఆమెకు అవకాశాలు ఇచ్చారంటే ప్రతిభ ఉన్న గాయని కావడమే అని అర్థమవుతుంది.
 శిల్పారావు అనేక స్వచ్ఛంద సంస్థలకు కూడా విరాళాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా దేవర మూవీలో ఆమె పాడిన పాటకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. పాట చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె తాజాగా జైలర్, పఠాన్ సినిమాల్లో పాటలను పాడారు. తమన్న డ్యాన్స్ తో ఊపు ఊపిన కావాలయ్య పాటను పాడింది శిల్పారావే. ఈమె ఫొటో గ్రాఫర్ రితేశ్ కృష్ణను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.
TAGS