Devara Vs OG : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల లిస్ట్ తీస్తే వాటిల్లో ఎన్టీఆర్ ‘దేవర’ , పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాలు కచ్చితంగా ఉంటాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా దక్కించుకున్నాయి. రెండు చిత్రాలలో ఏ చిత్రానికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది .
‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా ఇప్పటి వరకు రాలేదు. #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న తర్వాత చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కావడం తో ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రీ ఎంట్రీ తర్వాత ఆయన వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసాడు.
మిగిలిన హీరోలు ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే, పవన్ కళ్యాణ్ స్థాయి సూపర్ స్టార్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసారు. అలాంటి సమయం లో రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యాలని పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఆయన ఏకంగా ‘ఓజీ’ లాంటి పాన్ ఇండియన్ చిత్రం చెయ్యడం తో వాళ్లలో ఎక్కడలేని జోష్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది మా పవర్ స్టార్ రేంజ్ అంటూ, సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఒక రేంజ్ లో హడావడి చేసేవారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల, ఎన్నికలు పూర్తి అయ్యే వరకు మిగిలిన షూటింగ్ పూర్తి చెయ్యలేని పరిస్థితి ఉంది.
అంటే సమ్మర్ లో వచ్చే ఛాన్స్ లేదు, ఎన్టీఆర్ దేవర చిత్రం కూడా ఏప్రిల్ 5 వ తేదీన వచ్చే విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు చిత్రాలు ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అదే కనుక జరిగితే ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య బాక్స్ ఆఫీస్ పోరు తప్పదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో అనేక సార్లు పోటీపడ్డాడు పవన్ కళ్యాణ్. ఈ పోటీ లో అధిక శాతం పవన్ కళ్యాణ్ గెలిచాడు, మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.