Air quality : ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. 400 దాటిన ఏక్యూఐ

air quality : దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచా 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ లో తీవ్రమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్ ను దాటి ‘తీవ్రమైన కేటగిరి’లోకి చేరింది. నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ లలో గాలి నాణ్యత 188గా ఉంది. దీంతో హాట్ స్పాట్ లుకా గుర్తించిన ప్రాంతాల్లో నీటిని జల్లులుగా చిలకరించడంతో పాటు నిర్మాణ, కూల్చివేత ప్రదేశాలలో ధూళి నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బిహార్ లోని మూడు నగరాలతో పాటు హర్యానాలోని రెండు నగరాలు, చండీగఢ్ ప్రాంతాలు దేశంలోని టాప్ 10 కాలుష్య ప్రదేశాలుగా గుర్తించారు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ, అమృత్ సర్ నుంచి పలు ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం అర్ధరాత్రి పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బుధవారం సైతం పలు విమానాలే ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.

TAGS