Tech Companies : 20 ఏళ్ల తర్వాత వినాశనం.. ఎవ్వరూ ఊహించనిది.. టెక్ సంస్థల్లో ఇది జరగనుంది.!

this is going to happen in tech companies

this is going to happen in tech companies

Tech Companies : టెక్కీలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు కంపెనీ లేఆఫ్ అంటూ మేయిల్ పంపుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ భయంతోనే గడుపుతున్నారు.

అయితే, ప్రపంచంతో పోలిస్తే భారత్ లో ఐటీ రంగం పరిస్థితులు కొంత మెరుగ్గానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అయినప్పటికీ దేశీయ ఐటీ కంపెనీలు ఇక్కడి ఇంజినీర్లకు, గ్రాడ్యేయేట్లకు సంతోషం కలిగించే శుభవార్త మత్రం చెప్పడం లేదు. రిక్రూట్ మెంట్ విషయంలో కంపెనీలు మరింత కఠినంగా ఉన్నాయని తెలుస్తోంది. ఐఐటీ, ఐఐఎమ్ లాంటి దిగ్గజ సంస్థల్లో స్వల్ప రిక్రూట్ మెంట్ ధోరణి కొనసాగుతోంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం భారత్ ఐటీ రంగంలోని కంపెనీల రిక్రూట్ మెంట్ 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందన్న విషయాలు కొంత ఆందోళనను కలిగిస్తున్నాయి. ఏడాదిలో టెక్ కంపెనీలు 70 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులతో అత్యంత తక్కువ నియామకాలను జరిగినట్లు తెలుస్తోంది. కరోనాలో 2022 టెక్ ఉద్యోగులకు భారత్ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మంచి బూమ్ ఏర్పడిన కాలం. ఆ సమయంలో దేశీయ టెక్ సంస్థలు రికార్డు స్థాయిలో 6 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.

2023లో కూడా దేశీయంగా ఫ్రెషర్ల నియామకం 2.50 లక్షలకు చేరుకున్నాయి. ఏడాది చివరి త్రైమాసికంలో పరిస్థితులు, ఆదాయం కూడా దిగజారడంతో కంపెనీలు కొత్త నియామకాలను పాక్షికంగా నిలిపేశాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి బడా టెక్  కంపెనీలు కూడా క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌లకు దూరంగా ఉండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టైర్-2 నగరాల్లోని ప్రతిభావంతులైన టెక్ ఉద్యోగ ఆశావహులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

TAGS