JAISW News Telugu

Naga Chaitanya : నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ అయినా..శోభిత ఆ పని ఆపలేదు..!

Naga Chaitanya

Naga Chaitanya and Shobitha

Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూలిపాళ ఎంగేజ్‌మెంట్ నుంచి వీరిపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత కంటే మొదటి నుంచే శోభితతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడని కొందరు అంటుంటే.. ఫ్యామిలీ మ్యాన్ లో బోల్డ్ సీన్స్ లో నటించినందుకే సమంతను నాగ చైతన్య విడిచిపెట్టాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వారి పర్సనల్ విషయాలు, గొడవలు మనకు ఎందుకు అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరపైకి వచ్చింది.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో సమంత పాత్ర, ముఖ్యంగా ఆమె ఆకర్షణీయమైన నటన విడాకుల వరకు దారి తీసిందని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ రూమర్స్ అవాస్తవమని తేలిపోయింది. ఎందుకంటే నాగ చైతన్యకు తన భార్య గ్లామరస్, బోల్డ్ కంటెంట్ లో నటించడం ఇష్టం లేకుంటే.. ముద్దు సీన్లు, ఇంటిమేట్ మూమెంట్స్ తో నిండిన శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం జరిగి ఉండేది కాదు. నిజానికి శోభిత బోల్డ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కు పెట్టింది పేరు. ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్, గ్లామరస్ పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే, గతంలో ఒక ఇంటర్వ్యూలో శోభిత ధూలిపాళ మాట్లాడుతూ సమంత బోల్డ్ కటెంట్ లో నటించడం వల్ల విడాకులు అయ్యాయని తాను నమ్మనని. ఎందుకంటే నాగ చైతన్య ఓపెన్ మైండెడ్ గా ఉంటాడని, ఇలాంటి వాటికి అభ్యంతరం చెప్పడని శోభిత అన్నారు. పెళ్లి తర్వాత ఓటీటీ షోల్లో నటించడం మానేసే ఆలోచన తనకు లేదని చెప్పుకచ్చింది. శోభిత వెబ్ సిరీస్ లో నటిస్తుందని తాజా సమాచారం. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరగగా.. పెళ్లి తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version