Ram Charan : మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనదైన కష్టంతో టాప్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్. ఆయన కెరీర్ లో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వారసత్వ నటుడిగా ఉండే అడ్డంకులన్నీ దాటి తనదైన మార్క్ తో ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఫ్యాన్స్ ముద్దుగా పిలవడమే కాదు అఫీషియల్ గా టైటిల్స్ కూడా గ్లోబల్ స్టార్ అని వేస్తున్నారు.
రామ్ చరణ్ తన స్టార్ స్టేటస్ ను పక్కనపెట్టి రంగస్థలం వంటి మూవీతో దేశ స్థాయిలో అందరినీ ఆకర్షించాడు. తన నటనతో విమర్శకుల నోళ్లను మూయించాడు. రంగస్థలం మూవీతో యాంటీ ఫ్యాన్స్ సైతం చప్పట్లు కొట్టేలా చేశాడు రామ్ చరణ్. సినిమాలతోనే కాదు తన మంచి మనస్సుతో కూడా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. రంగస్థలానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావాల్సి ఉన్నా అప్పటి పరిస్థితుల్లో త్రుటిలో మిస్ అయ్యాడు. కచ్చితంగా వస్తుందనుకున్న అవార్డు రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీ కూడా నిరాశ చెందింది అనడంలో సందేహం లేదు.
ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి టామ్ అండ్ జెర్రీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈక్రమంలో మంచు ఫ్యామిలీ విపరీతంగా ట్రోల్ కు గురవుతుండేది. అయితే యంగ్ హీరోల మధ్య మాత్రం ఈ విభేదాలు లేవనేది నిజం. రామ్ చరణ్, పవన్, అల్లు..వంటి హీరోలతో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి సోదరాభిమానంతో ఉంటారు. రంగస్థలం సమయంలో రామ్ చరణ్ నేషనల్ అవార్డుకు అర్హుడు అంటూ మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. అవార్డు గెలుచుకున్న వారిపట్ల నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ నిజాయితీగా చెబుతున్నా.. నా బ్రదర్ రామ్ చరణ్ కు రంగస్థలం చిత్రానికి గాను నేషనల్ అవార్డు రావాల్సింది.
ఇటీవల కాలంలో ఏ నటుడి నుంచి అయినా ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఏదేమైనా ఆడియన్స్ ప్రేమే పెద్ద అవార్డు అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ కూడా మంచు విష్ణు చేసిన పనిని మెచ్చుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నా ఇలా నిజాయితీగా ఒపీనియన్ చెప్పడానికి గట్స్ ఉండాలంటూ అభినందించారు.