Deputy CM Pawan : జాతీయ అంతరిక్ష దినోత్సవం.. పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్

Deputy CM Pawan
Deputy CM Pawan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్ లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్ లో హెలిప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అంతకుముందు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేసీ శుభం బన్సల్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పవన్ హెలికాప్టర్ లో షార్ కు బయలుదేరి వెళ్లారు.