Deputy CM Pawan : అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

Deputy CM Pawan
Deputy CM Pawan : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నుంచి అమిత్ షా ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనతో పవన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమిత్ షాతో పవన్ ఏకాంతంగా బేటీ అయ్యారు.
ఇరువురి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. సహకార శాఖతో పాటు పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపైనా మాట్లాడినట్లు సమాచారం. అలాగే ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అమిత్ షాతో పవన్ చర్చించారు. సమావేశం అనంతరం ఆయన ఏపీకి బయలుదేరారు.