Deputy CM Pawan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు (బుధవారం) ఢిల్లీకి వెళ్తున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లి సాయంత్రి 6.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకొని ఆయనతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయలపై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, పవన్ కల్యాణ్ ఇటీవల పోలీసు అధికారులపై చేసిన విమర్శల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అమిత్ షాతో సమావేశం పూర్తయ్యాక, పవన కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. అక్కడ కొంత సమయం ఉండి, ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి రాత్రి 10.40 గంటలకు గన్నవరం చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి తిరిగి చేరుకుంటారు.