Deputy CM Pawan Kalyan : 19న బాధ్యతలు స్వీకరించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తారు. ఈ నెల12న పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయనకు శాఖలు కేటాయించారు.
తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించారని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.