Deputy CM Pawan Kalyan : ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడ సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై అధికారులతో డిప్యూటీ సీఎం చర్చించారు. తుపాన్ పరిస్థితులపై ఫొటో గ్యాలరీని పరిశీలించారు.
అంతకు ముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పలువురు ఆయన వాహనంపై పూలు చల్లి అభిమానం చాటుకున్నారు.