JAISW News Telugu

YCP Office : వైసీపీ ఆఫీస్ కూల్చివేత.. ప్రతీకారం షురూ చేసిన టీడీపీ

YCP Office

YCP Office in Tadepalli

YCP Office : 2019ఎన్నికలకు ముందుకు ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉంటామని రామరాజ్యం తీసుకుని వస్తామని భీరాలు పలికారు వైసీపీ నేతలు. అది నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసి పెత్తనం చేతిలో పెట్టారు ఓటర్లు. ఇక అధికారం దక్కింది కదా తమను ఎవరూ ఆపలేరన్న నమ్మకంతో వైసీపీ నేతలు కనీస అనుమతులు కూడా తీసుకోకుండా ఇష్టారాజ్యంగా తమ పార్టీ ఆఫీసులను నిర్మంచుకోవడం మొదలు పెట్టారు. ఈ ఐదేళ్ల నియంతృత్వ పాలన చూసిన ప్రజలు ఛీ కొట్టి అధికారం లాగేసుకున్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో వాటి కూల్చివేతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. మొదట తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారు జామున 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని రెండు ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారంభించింది. అయితే నిర్మాణం అక్రమమంటూ గతంలో సీఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. తాడేపల్లిలో అత్యంత ఖరీదైన రెండు ఎకరాల భూమిని ఎకరం వెయ్యి చొప్పున లీజుకు ఇచ్చుకున్నారు వైసీపీ నేతలు. అందులో నిర్మాణాలు ప్రారంభించారు. కానీ వేగంగా నిర్మించలేదు. ఎలాంటి అనుమతులు కూడా తీసుకోకుండా పిల్లర్లు లేపారు. కొద్దిగా పిల్లర్లు లేపారు. అవి కూడా కూల్చేస్తారేమో అన్న భయంతో హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిబంధనల ప్రకారమే అన్ని లాంఛనాలు పూర్తి చేసి కూల్చివేసింది.

వైసీపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పాలన సులభతరం చేయడానికి కనీసం ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా నిర్మించలేదు. కానీ వైసీపీ ఆఫీసుల కోసం మాత్రం.. ప్రతి జిల్లాలోన రెండు ఎకరాలు కేటాయించుకున్నారు. అత్యంత ఖరీదైన స్థలాలను ఎడాదికి రూ. వెయ్యి చొప్పున లీజుకు కేటాయించుకున్నారు. విశాఖలో ఎలాంటి ప్లాన్లు లేకుండా శరవేగంగా నిర్మాణాలు కూడా పూర్తి చేశారు. కాపు కార్పొరేషన్ కు కేటాయించిన స్థలాలు సహా దేన్నీ ఆ ప్రభుత్వం వదల్లేదు. అక్రమంగా లీజుకు తీసుకోవడమే కాకుండా భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోకపోవడంతో వాటికి కూడా కూల్చివేత ముప్పు పొంచి ఉంది. విశాఖలో దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనానికి కనీసం ఒక్క అనుమతి కూడా లేదు. రాత్రికి రాత్రి అనుమతి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ భవనాన్ని కూల్చేస్తారా .. సీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version