Musi River : మూసీ రివర్ బెడ్ లో ఖాళీ చేసిన ఇళ్లు కూల్చివేత

Musi river bed
Musi river bed : మలక్ పేట పరిధిలోని శంకర్ నగర్ మూసీ రివర్ బెడ్ లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసిరాం నగర్ లో మూసీ పరీవాహక ప్రాంత వాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఈ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.