JAISW News Telugu

Delhi Liquor Case : ఆయన తిన్నది మూడు మామిడి పండ్లే..!

Delhi Liquor Case Kejriwal

Delhi Liquor Case-Kejriwal

Delhi Liquor Case-Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రతిపక్ష పార్టీల నేతలకు చుక్కలు కనపడుతున్నాయి. ఈ కేసులో సిసోడియా, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు అరెస్టు కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  కూడా కటకటాల పాలయ్యారు. పర్సనల్ డాక్టర్ ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..తన ఆరోగ్యంతో ఈడీ చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. తన ప్రాణాలను తీసేందుకే ఈడీ అత్యవసరమైన ఇన్సూలిన్ మెడిసిన్ ను గత 29 రోజులుగా అందకుండా ఈడీ అడ్డుకుందని కోర్టుకు చెప్పారు.

2012 నుంచి తాను ప్రతీరోజూ ఉదయం 28 యూనిట్ల ఇన్సూలిన్, రాత్రి 22 యూనిట్ల ఇన్సూలిన్ తీసుకుంటున్నానని చెప్పారు. షుగర్ లెవల్స్ డౌన్ అవుతున్నందున వారానికి మూడు రోజులు 15 నిమిషాల చొప్పున పర్సనల్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతించాలని కోరారు.  దీనికి ఈడీ తన వాదనలు వినిపిస్తూ..‘‘న్యాయవాదులతో ములాఖత్ అయ్యేందుకు ఇచ్చిన అవకాశాన్ని కూడా కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారు. దీనిపై కోర్టు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ తో ములాఖత్ అంటే ఎలా?’ అని పేర్కొంది.

బెయిల్ పొందేందుకే తాను మామిడి పండ్లు, స్వీట్లను తింటున్నానని ఈడీ చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు. ‘‘పక్షవాతం వచ్చేలా.. తన ప్రాణాలను కేజ్రీ రిస్క్ లో పెట్టుకుంటారా?’ అని ఆయన ఈడీని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్ కు ఇంటి నుంచి 48 సార్లు మీల్స్ వచ్చాయి.

కేవలం మూడు సార్లే మీల్స్ తో పాటు మామిడి పండ్లను పంపారు. ఏప్రిల్ 8 తర్వాత మామిడి పండ్లను అస్సలు పంపలేదు. జైలులో ఆరు సార్లే స్వీట్లు తిన్నారు.’’ అని లాయర్ వివరించారు. ‘‘మామిడి పండ్లను ఈడీ భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి వాటి కంటే గోధుమలు, బియ్యంలోనే ఎక్కువ మోతాదులో షుగర్ లెవల్ ఉంటుంది.’’ అని తెలిపారు. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది.

Exit mobile version