JAISW News Telugu

Atishi Marlena : ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు

Atishi Marlena

Atishi Marlena

Atishi Marlena : ఢిల్లీ మంత్రికి అతిషి మర్లినాకు రౌస్‌ అవెన్యూ కోర్టు సమన్లు జారీచేసింది. జూన్‌ 29న కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్‌ ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ వేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు అతిషికి మంగళవారం నోటీసులు పంపించింది.

గతంలో అతిషి బిజెపి ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, వారికి డబ్బు ఆశ చూపి ఆ పార్టీలోకి ఆహ్వానిస్తోందని ఆరోపించారు. అతిషి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, బిజెపి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రవీణ్‌ పరువునష్టం దావా వేశారు. ఇక కేసులో ఈ ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా చేర్చారు. అయితే అతిషికి సమన్లు జారీచేసిన కోర్టు కేజ్రీవాల్‌ విషయంలో మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

ఆప్ నేతల ఆరోపణలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ పిటిషన్ లో తెలిపారు. కోర్టులో కేజ్రీవాల్ చేసిన మీడియా పోస్టును చూపించారు. బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించిందని, పార్టీ మారడానికి రూ. 25 కోట్లు ఆఫర్ ఇచ్చిందని లేని పక్షంలో ఈడీ ఆమెను అరెస్టు చేస్తుందని అతిషీ చేసిన వాదనను కూడా కోర్టులో వినిపించారు. అతిషీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, టీవీ, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత తన పిటిషన్ లో కోరారు.

Exit mobile version