Delhi Cm atishi : ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టాక అతిషీ చాలా యాక్టివ్ గా పాలన వ్యవహారాలు నడిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్ ప్రైజ్ విజిట్ లు చేస్తూ హడలెత్తిస్తున్నారు. సిబ్బందిలో క్రమశిక్షణ పెంపొందిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని సంగం విహార్‌లోని ఒక MCD పాఠశాలను సీఎం అతిషీ తనిఖీ చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌కు తెలియజేయకుండా గైర్హాజరు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. పాఠశాల డేటాలో అవకతవకలు కనుగొనబడ్డాయి. దీంతో సీఎం అతిషి “నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చర్య తీసుకున్న నివేదికను సమర్పించారు.
బుధవారం సంగం విహార్ జె-బ్లాక్‌లోని MCD పాఠశాలలో సీఎం సర్ ప్రైజ్ విజిట్ తో అందులోని సిబ్బంది పరుగులు తీశారు. ఆమె కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం. తనిఖీలో, ఒక తరగతిలో ఉపాధ్యాయుడు లేరని తెలుసుకున్నారు. హాజరుకాని విషయం ప్రిన్సిపాల్‌కు తెలియలేదు. ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వకుండానే మరో ఉపాధ్యాయుడు గైర్హాజరైనట్లు తరగతుల తనిఖీలో తేలింది.దీంతో వారిని సస్పెండ్ చేసి షాకిచ్చారు.
మొత్తంగా సీఎంగా బాధ్యతలు చేపట్టాక పనుల విషయంలో అతిషీ దూకుడు పెంచారు.
एक्शन में शिक्षा मंत्री @AtishiAAP – संगम विहार जी-ब्लॉक स्थित एमसीडी स्कूल में किया औचक निरीक्षण | LIVE https://t.co/jhAD8ipVum
— AAP (@AamAadmiParty) September 20, 2023