Delhi Capitals : ‘‘అప్పు ఎవరికీ చేదు..’’, ‘‘అప్పు చేసి పప్పుకూడు..’’ ‘‘అప్పిచ్చి వాడు వైద్యుడు..’’ ఇలా తెలుగు నాట అప్పులపై ఎన్నో సామెతలు ఉన్నాయి. ప్రతీ మనిషి ఏదో సందర్భంలో అప్పు తీసుకుని ఉంటాడు. అప్పు కావల్సిన వాడు అప్పిచ్చేవాడి చుట్టూ తిరుగుతాడు. ఆ తర్వాత అప్పుతీసుకున్న వాడి చుట్టూ అప్పిచ్చిన వాడు తిరుగతాడు అని కామెడీగా మన పెద్దలు చెబుతారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే.. అప్పు అనేది సహజం. అప్పులను పేదవాడైన తీసుకుంటాడు.. బడా పారిశ్రామిక వేత్తలైనా తీసుకుంటారు.
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని అప్పులు చేయాలని చూస్తున్నాడట. ఈ విషయం అత్యంత విశ్వసనీయ వర్గాల తెలిసిందట. 90 మిలియన్ డాలర్ల నుంచి 100 మిలియన్ డాలర్ల మధ్య ప్రైవేట్ క్రెడిట్ ద్వారా తీసుకుంటున్నాడని అంటున్నారు.
క్లబ్ యాజమాన్యంలోని జేఎస్ డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పు ద్వారా వచ్చిన డబ్బులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తుందని, ఈ విషయం వ్యక్తిగతమైనందున పేరు వెల్లడించడానికి నిరాకరించిన వ్యక్తులు తెలిపారు. బ్రాడ్ కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్ షిప్ లతో సహా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ రుణానికి మద్దతు ఇస్తుందని వారు చెప్పారు.
ఏ డీల్ జరిగినా జేఎస్ డబ్ల్యూ జీఎంఆర్ ను లాభదాయకమైన క్రీడా రంగంలో తాజా వ్యాపారంగా మార్చి నిధుల కోసం ప్రైవేటు రుణం వైపు మొగ్గు చూపుతోంది. అలాగే చెల్సియా ఎఫ్ సీ 500 మిలియన్లను ఏరెస్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ నుంచి సేకరించింది. అయితే దీనిపై స్పందించేందుకు జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించినట్లు తెలిసింది.