SBI Angry : ఆ ఫొటో డిలీట్ చేయండి.. ఓ నెటిజన్ పై SBI ఆగ్రహం

SBI Angry

SBI Angry on Netizen

SBI Angry on Netizen : ఎస్ బీఐ బ్రాంచ్ ఫొటో తీసి ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఎస్బీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫొటోను డిలీట్ చేయాలంది. రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దగ్గరలోని ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్లాడు. అతను వెళ్లిన సమయంలో సిబ్బంది ఎవరు విధుల్లో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో వెంటనే ఖాళీ క్యాబిన్లతో ఉన్న ఆ ప్రాంగణాన్ని ఫొటో తీశాడు.

లలిత్ సోలంకి పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో షేర్ చేసి, ఆగ్రహాన్ని వెళ్లగక్కాు. ’’అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలవుతోంది. సిబ్బంది లంచ్ కు వెళ్లారు. విచిత్రమేమిటంటే, మాకు లంచ్ బ్రేక్ లేదని ఎస్బీఐ చెప్తుంటే, సిబ్బంది కలిసికట్టుగా భోజనం చేయడానికి వెళ్లారు. ఈ ప్రపంచం పూర్తిగా మారిపోవచ్చు కానీ.. మీ సేవలు మాత్రం మారవు’’ అని పోస్టు పెట్టాడు.

అయితే, ఆ వినియోగదారుడికి కలిగిన అసౌకర్యంపై చింతించిన బ్యాంక్.. ఫొటో షేర్ చేయడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. భద్రతా కారణాల దృష్ట్యా బ్రాంచ్ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీయడం నిషిద్ధమని గమనించండి. అది దుర్వినియోగమైతే బాధ్యత మీదే. సోషల్ మీడియా ఖాతాల నుంచి దానిని తొలగించాలి’’ అని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆ ఫొటో వైరల్ కావడం, పలువురు కామెంట్లు పెట్టడం జరిగిపోయింది.

TAGS